Live Video-Agnipath Protest in Hyderabad: అగ్నిపథ్‌ సెగలు తెలంగాణకు తాకాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అభ్యర్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిరసన తెలిపారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలోనే రైళ్లపై రాళ్ల దాడి చేసి..నిప్పు పెట్టారు. సికింద్రాబాద్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా స్టేషన్‌లోకి అభ్యర్థులు చొచ్చుకురావడంతో గందరగోళం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఐనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.


Also read: Sai Pallavi: మరో వివాదంలో సినీ నటి సాయి పల్లవి..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!


Also read:AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు..మీ కోసం కీలక సూచనలు..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook