AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు..మీ కోసం కీలక సూచనలు..!

AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు రానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 17, 2022, 10:31 AM IST
  • త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • ఈసారి కొత్తగా డిజిటల్ స్కోర్ కార్డులు
AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు..మీ కోసం కీలక సూచనలు..!

AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు రానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలను bie.ap.gov.inను వెళ్లి చూడవచ్చు. ఈసారి కొత్తగా విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డులు ఇవ్వనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు జరిగాయి. ఈ ఏడాది మొత్తం 4.7 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ చదివినట్లు తెలుస్తోంది. ఐతే ఇందులో 4 లక్షల 64 వేల 756 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు. ఈఏడాది ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇంటర్ ఫలితాల్లో మీ మార్కులను ఇలా చూసుకోండి..

-BSEAP అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.in వెళ్లండి
-హోమ్‌ పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
-లాగిన్ సమాచారాన్ని నమోదు చేసి..సమర్పించు బటన్‌పై క్లిక్ చేయాలి
-ప్రాసెస్ పూర్తి కాగానే ఫలితం వస్తుంది
-భవిష్యత్ అవసరాల కోసం హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని..సేవ్‌ చేసుకోండి

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కీలక అంశాలు మీ కోసం..

-ఈసారి కొత్తగా విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డులు
-bie.ap.gov.inలో డిజిటల్ స్కోర్ కార్డులు అందుబాటులో ఉంటాయి
-ఫలితాల్లో 90 శాతం కంటే ఎక్కువ మార్క్‌లు సాధించిన వారికి ప్రభుత్వ నుంచి స్కాలర్ షిప్‌లు

Also read: Sai Pallavi: మరో వివాదంలో సినీ నటి సాయి పల్లవి..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!

Also read: Cooking Oils Rates: సామాన్యులకు గుడ్‌న్యూస్..వంట నూనెల ధరలు ఎంతమేర తగ్గాయో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News