BIG SHOCK TO TRS: నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ షాక్.. 5 వందల మంది నేతల రాజీనామా
BIG SHOCK TO TRS: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సవాల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు ముందు కారు పార్టీకి హ్యాండిచ్చారు నేతలు. అది కూడా సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న ఆ రోజే.. ఆ జిల్లా నేతలే పార్టీకి రాజీనామా చేయడం గులాబీ పార్టీకి షాకింగ్ గా మారింది.
BIG SHOCK TO TRS: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సవాల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు ముందు కారు పార్టీకి హ్యాండిచ్చారు నేతలు. అది కూడా సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న ఆ రోజే.. ఆ జిల్లా నేతలే పార్టీకి రాజీనామా చేయడం గులాబీ పార్టీకి షాకింగ్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అధికార పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు నేతలు. తుర్కప్లలి(ఎం) మండలానికి చెందిన దాదాపు 5 వందల మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పార్టీకి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వీళ్లంతా మునుగోడులో జరగనున్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సభలో పడాల శ్రీనివాస్ నాయకత్వంలో కమలం గూటికి చేరనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రాజీనామా ప్రకటన చేసిన తర్వాత మీడియాతో మట్లాడిన పడాల శ్రీనివాస్.. స్థానిక ఎమ్మెల్యే తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాదాపు 5 వందల మందికి పైగా రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఆలేరు ఎమ్మెల్యేపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్లు పడాల శ్రీనివాస్ తెలిపారు. రాజీనామాలు చేసిన వారిలో మండల మహిళా అధ్యక్షురాలు మేకల లావణ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు బర్ల లచ్చయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు జంగిటి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి భానోత్ శత్రు నాయక్, మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బన్సీ నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు మాడిశెట్టి శ్రీను, పట్నం భిక్షపతి, చిలుకురి రమేష్, రాక్యల రమేష్, భాస్కర్ యాదవ్, అనిల్, కనకరాజు ఉన్నారు. పడాల శ్రీనివాస్ బాటలోనే మరికొందరు అధికార పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook