హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలు..అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ నరసింహన్ కు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపుతూ వినతి పత్రం సమర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో 17 మంది విద్యార్ధుల ఆత్మహత్యకు కారణమైన ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు..ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్ధిక సాయంగా రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని గవర్నర్ ను కోరినట్లు తెలిసింది.


గవర్నర్ ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, టీడీపీ నేతలు ఎల్. రమణ, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ తదితరులు ఉన్నారు.