హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషనులో బాంబు పెట్టారని ఓ వదంతి నగరమంతా వ్యాపించింది. ఈ సమాచారం రావడంతో పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి, బాంబు స్క్వాడ్ సహాయంతో స్టేషన్ మొత్తం గాలించారు. అనేక చోట్ల తనిఖీలు కూడా చేపట్టారు. స్టేషనులో అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగు వల్లే ఈ వదంతి వ్యాపించి ఉంటుందని పోలీసులు 


అనుకుంటున్నారు. కాకపోతే ఆ బ్యాగు ఓ మెట్రో రైలు ఉద్యోగిది అని తర్వాత తెలిసింది. అయినా కూడా స్టేషన్‌తో పాటు, చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా తనిఖీ చేసిన పోలీసులు ఆఖరికి బాంబు  లేదని తేల్చారు. బాంబు ఉందని తొలుత సమాచారం అందుకున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు, క్లూస్ టీంకి సమాచారం అందించి,  ఆ తర్వాత కుక్కలను తోడ్కొని వచ్చి, స్టేషన్ మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు.