Maruthi Rao ఆత్మహత్య : నాన్న గురించి అమృత ఏం చెప్పిందంటే...
తెలంగాణాలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నేడు మిర్యాలగూడ హిందూ శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణాలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నేడు మిర్యాలగూడ హిందూ శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించారు. తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై మీడియాతో మాట్లాడుతూ..నేను తన తండ్రి శవాన్ని చూడడానికి వెళ్ళానని, అనుమతించలేదని అన్నారు. అయితే తన భర్త ప్రణయ్ ని చంపారన్న కోపం తప్ప, మరేది లేదని, తమ కుటుంబానికి సంబంధించి ఆస్తి తగాదాలు చాలా కాలం నుండి ఉన్నాయని ఆమె అన్నారు. తన బాబాయ్ అయిన శ్రవణ్ తన తండ్రి మారుతిరావుతో గొడవ పడేవాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు తన తండ్రి కాదని ఆమె అన్నారు.
Also Read: మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్
తన భర్త ప్రణయ్ చనిపోయినప్పుడు ఎంతో మనోధైర్యంతో ఉన్నానని, కానీ ఇప్పుడు ఉండకలేకపోతున్నానని, నాకు అత్త, మామ, కుటుంబం ఉన్నారని ఆమె అన్నారు. నేను అమ్మ దగ్గరకి వెళ్లలేనని, ఆమె వస్తే నేను కాదనను తెలిపారు. స్మశానవాటిక వద్ద మమ్మల్ని శ్రవణ్ (బాబాయ్) కూతురు నేట్టేసిందని, వాళ్ళు కనీసం చూడనివ్వలేదని, బినామీ ఆస్తులు కొంతమంది వ్యక్తులపై ఉన్నాయని ఆమె అన్నారు. మా బాబాయ్ వల్ల అమ్మకు హాని ఉందని, నా దగ్గరికి వస్తే రక్షణగా ఉంటానని, నేను అత్త మామలతో ఉంటాను, అమ్మతోనూ ఉంటానని అన్నారు.
Also Read: మారుతీ రావు సూసైడ్ నోట్‌లో అమృత ప్రస్తావన
కాగా రెండు సంవత్సరాల క్రితం తన కూతురు ప్రణయ్‌ని ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో ప్రణయ్ ని హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు శిక్ష అనుభవించి జైలు నుంచి విడులయ్యాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..