Madhapur Accident: మాదాపూర్‌లో కారు బీభత్సం..ముగ్గురికి గాయాలు
Madhapur Accident:హైదరాబాద్‌లో మందుబాబులు మళ్లీ రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మాదాపూర్‌లోని సాయి నగర్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఓ సెల్లార్‌లోకి దూసుకెళ్లింది.
Madhapur Accident: హైదరాబాద్‌లో మందుబాబులు మళ్లీ రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మాదాపూర్‌లోని సాయి నగర్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఓ సెల్లార్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకులను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యువకులు మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారును డ్రైవింగ్ చేసిన వ్యక్తి హరికృష్ణగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. మద్యం సెవించి వాహనాలు డ్రైవింగ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్న మందు బాబులు వాటిని బేఖాతరు చేస్తున్నారు.
Also Read: Movie songs on TTD LED screens: తిరుమలలో అపచారం ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు
Also Read: PK-KCR: కేసీఆర్‌తో పీకే వరుస సమావేశాలు, మరి కాంగ్రెస్‌లో చేరిక సంగతేంటి, అసలేం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.