తెలంగాణ పోల్స్: తెరపైకి మరో కూటమి
తెలంగాణలో మరో కూటమి పురుడుపోసుకోనుందా ? బీజేపీ ప్రయత్నాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. ఒకవైపు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీ పరోక్ష మద్దతుతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు మహాకూటమి ఐక్యంగా ముందుకు పోతుంది. దీంతో ఒంటరైన బీజేపీ రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక పార్టీలను ఏకం చేసి వారి మద్దతు తీసుకొని ఎన్నికల బరిలోకి దిగాలను యోచిస్తోంది.
ఈ క్రమంలో ఈ రోజు యువ తెలంగాణ పార్టీ నేతలతో బీజేపీ చర్చలు జరిపి ఆ పార్టీ మద్దతు కూడగట్టింది. బీజేపీ నేత ప్రదీవ్ ఇంట్లో సమావేశమైన ఇరు పార్టీల నేతలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మరిన్ని పార్టీలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంతో తమతో కలిసి వచ్చిన పార్టీలతో కలిసి బీజేపీ వ్యూహాత్మకంగా ఇలా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఒకవైపు మహాకూటమి మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీని తట్టుకొని బీజేపీ ఎన్నికల క్షేత్రంలో ఏ మేరకు నిలబడుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది ఇప్పుడు చర్చనీయశంగా మారింది