Karate Kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి... ఆమెతో ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మరో వ్యక్తి ఫిర్యాదు
Another Complaint on Karate Kalyani: సినీ నటి కరాటే కల్యాణితో ప్రాణ భయం ఉందంటూ మరో వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. గతంలో ఆమె తనను బెదిరించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Another Complaint on Karate Kalyani: సినీ నటి కరాటే కల్యాణి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కల్యాణి గొడవ మరవకముందే మరో బాధితుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరాటే కల్యాణితో తనకు ప్రాణ భయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బాధితుడి ఫిర్యాదు ప్రకారం... హైదరాబాద్ కూకట్‌పల్లి సమీపంలోని జగద్గిరిగుట్టలో గతేడాది ఓ యువతి అత్యాచారానికి గురైంది. అప్పట్లో ఈ ఘటనపై స్పందించిన కరాటే కల్యాణి... మీడియాలో ఆమె ఫోటోలు, వివరాలు బయటపెట్టింది. అత్యాచార బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిపోయి ఇలా బయటపెట్టడమేంటని వెంగళవరావు నగర్‌కి చెందిన నితేశ్ అనే వ్యక్తి ఆమెను ప్రశ్నించాడు. దీంతో నితేశ్‌పై కల్యాణి ఫైర్ అయ్యారు.
నువ్వెవరు నన్నడగడానికి అంటూ నితేశ్‌పై కల్యాణి మండిపడ్డారు. కల్యాణిపై నితేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... నాపైనే ఫిర్యాదు చేస్తావా... నీ అంతు చూస్తా అంటూ ఆమె బెదిరించారు. ఇటీవల ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుతో కల్యాణిపై కేసు నమోదైన విషయం తెలిసి నితేశ్ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. కరాటే కల్యాణితో తనకూ ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడితో కరాటే కల్యాణి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. మహిళలతో అసభ్యంగా వ్యవహరించే ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడంటూ అతనిపై ఆమె దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. నడిరోడ్డుపై ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
Also Read: Newyork Shooting: జాతి విద్వేష కాల్పులు... అమెరికాలో అగంతకుడి కాల్పుల్లో 10 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook