Karate Kalyani Vs Srikanth Reddy: ముదురుతోన్న వివాదం... కరాటే కల్యాణితో ప్రాణ హాని ఉందన్న ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి

Karate Kalyani Vs Srikanth Reddy: సినీ నటి కరాటే కల్యాణిపై యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ పలు ఆరోపణలు చేశాడు. కల్యాణితో తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 01:58 PM IST
  • కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ వివాదం
  • కరాటే కల్యాణితో ప్రాణ హాని ఉందన్న ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి
  • శ్రీకాంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన కరాటే కల్యాణి
Karate Kalyani Vs Srikanth Reddy: ముదురుతోన్న వివాదం... కరాటే కల్యాణితో ప్రాణ హాని ఉందన్న ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి

Karate Kalyani Vs Youtube Prankster Srikanth Reddy: సినీ నటి కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. శ్రీకాంత్ రెడ్డిని వదిలేది లేదని కరాటే కల్యాణి తెగేసి చెబుతోంది. అతను జైలుకు వెళ్లాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, కరాటే కల్యాణితో తనకు ప్రాణ హాని ఉందని శ్రీకాంత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. గూండాలతో తనను చంపేస్తామని బెదిరింపులకు గురిచేస్తోందని శ్రీకాంత్ రెడ్డి కరాటే కల్యాణిపై ఆరోపణలు చేశాడు. బతుకుదెరువు కోసం ప్రాంక్ వీడియోలు చేసుకునే తన నుంచి డబ్బులు డిమాండ్ చేయడమే కాక.. రేప్ కేసులు పెట్టిస్తానని.. చంపేస్తానని బెదిరిస్తోందన్నాడు.

గురువారం (మే 12) రాత్రి 9.45గం. సమయంలో కరాటే కల్యాణి ముగ్గురు అబ్బాయిలను తీసుకొని తన ఇంటి వద్దకు వచ్చిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపాడు. తనను బయటకు రమ్మని పిలిస్తే వెళ్లానని... సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావంటూ తనను కల్యాణి దూషించిందని పేర్కొన్నాడు. కృష్ణ లాంటి సినిమాల్లో బాబీ అంటూ మీరు చేసిన క్యారెక్టర్స్ కంటే మేం చేసిన ప్రాంక్స్ తక్కువేనని తాను వాదించినట్లు చెప్పాడు. తాను చేసే వీడియోలన్నీ స్క్రిప్టెడ్ అని.. ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి చేయించుకుంటామని... ఫేమ్ కోసం కొంతమంది అమ్మాయిలే కావాలని ప్రాంక్ వీడియోలు చేయించుకుంటారని వారితో చెప్పినట్లు తెలిపాడు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి తనను పక్కకు తీసుకెళ్లి రూ.70 వేలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని బెదిరించినట్లు చెప్పాడు. తాను డబ్బులివ్వనని... ఏం చేస్తారో చేసుకోండి అనడంతో కరాటే కల్యాణి తన చెంప పగలగొట్టిందని చెప్పాడు. అప్పటికీ తాను ఏమీ అనలేదని.. మూడోసారి కూడా కరాటే కల్యాణి తనపై చేయి చేసుకోవడం... పక్కనున్న వాళ్లు కర్రలతో తనపైకి రావడంతో తాను కూడా చేయి ఎత్తాల్సి వచ్చిందని చెప్పాడు. 

ఒకవేళ కరాటే కల్యాణికి నా వీడియోల పట్ల అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందని... ఇలా భౌతిక దాడులకు దిగడమేంటని ప్రశ్నించాడు. సినిమాల్లో చూపించే వాటి కన్నా శృతి మించి తానేమీ చేయట్లేదన్నారు. కరాటే కల్యాణిపై తాను ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. తానేమీ తప్పు చేయలేదని అన్నాడు. కరాటే కల్యాణితో ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదని... తన వెర్షన్ చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

వాడే మమ్మల్ని చంపేస్తామని బెదిరించాడు : కరాటే కల్యాణి

శ్రీకాంత్ రెడ్డే తమను చంపేస్తామని బెదిరించాడని కరాటే కల్యాణి ఆరోపించింది. పుట్టుకతోనే తాను ఫైటర్‌ను అని... వాడిని వదిలిపెట్టనని... వాడు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొంది. ప్రాంక్ పేరుతో చెత్త వీడియోలు చేసేవారికి శిక్ష పడాలన్నారు. తన తప్పుంటే ఉరి తీయించుకోవడానికైనా సిద్ధమన్నారు. శ్రీకాంత్ రెడ్డితో మర్యాదగా మాట్లాడేందుకే వెళ్లామని... కానీ అతనే దురుసుగా మాట్లాడి తమను రెచ్చగొట్టాడని అన్నారు. డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలను కల్యాణి ఖండించారు. తనకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు.

Also Read: One Family One Ticket: ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చింతన్‌ శిబిర్‌ లో చర్చ..!

Also Read : One Family One Ticket: ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చింతన్‌ శిబిర్‌ లో చర్చ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News