Potti Sriramulu Name Remove: అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ల మార్పు మినహా పెద్దగా పరిపాలన నిర్ణయాలు చేయని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజముద్ర, రాష్ట్ర గేయం, పేర్ల మార్పు వంటి వాటితో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రేవంత్‌ సర్కార్‌ తీసుకున్న మరో నిర్ణయం అగ్గి రాజేస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపుపై ఆర్య వైశ్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై వారు మండిపడుతున్నారు. పేరు మార్పుపై నిరసనకు దిగే అవకాశం ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Madhavi Latha: తిరుమలలో అత్యాచారం జరిగింది.. లడ్డూ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు


 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డిగా పేరు మార్చడంపై ఆర్యవైశ్య సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్‌ సర్కార్‌పై ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ఆర్యవైశ్య ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య కార్యాలయంలో సమావేశం కానున్నారు.

Also Read: KTR Harish Rao: కేటీఆర్‌, హరీశ్‌ రావు మధ్య విభేదాలు? ఒకే వేదిక పంచుకోని నేతలు


 


భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి తొలగించడం అమానుషంగా ఆర్యవైశ్య సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయంపై అన్ని జిల్లాలు, మండలాల నుంచి  ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా చర్యలు తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతి ఐక్యత కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలుగు జాతికి తెలియజేయాలని ఆర్యవైశ్య సంఘాలు కోరాయి. అంతే కానీ శ్రీరాములు పేరు తొలగించడం లాంటివి సరికాదని  అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యను ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో  ఆర్యవైశ్యులందరూ  పార్టీలకతీతంగా ఒకతాటి పైకి వచ్చి ఎక్కడికక్కడ  ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.


పేరు మార్పుపై వివాదం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చాలని భావించారు. అయితే పేర్ల జోలికి వెళ్తే కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని భావించి వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రిగా పదేళ్లు ఉన్న కేసీఆర్‌ ఏనాడూ పేర్ల మార్పు జోలికి వెళ్లలేదు. ఆంధ్రవారి పేర్ల వివాదానికి వెళ్లకుండా పదేళ్లు ప్రశాంతంగా పాలించాలి. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి 'ఆంధ్రవారి పేర్లు' అనే తేనేతుట్టను కదిలించారు. దీంతో వివాదం రాజుకుంది. మరి పేరు మార్పుపై ఆర్యవైశ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter