హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి మరికొన్ని రోజుల్లో పూర్తి అదుపులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ మర్కజ్ ప్రస్తావన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లోని  ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయం దాచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద లాక్‌డౌన్ విధులు నిర్వర్తించాడని, నాలుగు రోజుల తర్వాత ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆస్పత్రికిలో చేర్పించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యిందని తెలిపారు. దీంతో అతడితో పాటు విధులు నిర్వర్తించిన వారిని, కుటుంబ సభ్యులు 12 మందిని క్వారంటైన్‌కు పంపించారు. తాజాగా మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్ రావడంతో అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. అందులో ఇద్దరు కుమారులు, కూతురు, మనవడు నలుగురికి పాజిటివ్ వచ్చిందని, వెంటనే వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: అమెరికాలో మరో మర్కజ్.. కరోనా కేసుల పెరుగుదలకు ఆ ఔషధ కంపెనీయే కారణమా?


మర్కజ్ వెళ్లి వచ్చిన వారు స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కేసులు బయటపడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ శాఖలో ఉండి ఈ సమాచారాన్ని దాచడం సరైంది కాదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా సమాచారాన్ని దాచిపెట్టిన వారిపై పై అధికారులు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. క్రమశిక్షణ గల శాఖలో విధులు నిర్వర్తిస్తూ మర్కజ్ వెళ్లి వచ్చినప్పటికీ సమాచారం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యానికి గురిచేస్తోందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Also read : రేపు లాక్ డౌన్ పొడగింపుపై స్పష్టత