హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు (CoronaVirus Cases In Telangana) తక్కువగా చేస్తుందని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల (Antigen Test Kits)ను తెప్పిస్తోంది. మరికొన్ని రోజుల్లో దాదాపు 2 లక్షల కిట్లు తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. కేవలం 30 నిమిషాలలో ఈ యాంటీజెన్ టెస్ట్ కిట్లు కోవిడ్19 ఫలితాలను అందించనున్నాయి. త్వరగా ఫలితాలు రావడంతో పాజిటివ్ పేషెంట్లను గుర్తించి చికిత్స అందించడంతో పాటు నెగటివ్ వ్యక్తులకు కరోనా సంక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ప్రస్తుతానికి ప్రతిరోజూ దాదాపు 15 వేల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వీటి సంఖ్యను 25 వేలకు పెంచడంలో భాగంగా తాజాగా 2 లక్షల యాంటీజెన్ టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం తెప్పిస్తోంది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిపై (CoronaVirus) శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కొవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. KTR Ambulance: కేటీఆర్ కొత్త కార్యక్రమం..అదే బాటలో మంత్రులు


తెలంగాణ హైకోర్టు సూచనలు, సలహాల మేరకు జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను తెలిపేలా ఆదివారం (జులై 26) నుంచి కొత్త విధానంలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 52,466కి చేరింది. కరోనాతో రాష్ట్రంలో 455 మంది మరణించారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్