KTR Ambulance: కేటీఆర్ కొత్త కార్యక్రమం..అదే బాటలో మంత్రులు

Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనావైరస్ ( Coronavirus ) టెస్టింగ్ కోసం తన వంతుగా ఆరు అంబులెన్స్‌లను అందించనున్నట్టు తెలిపారు కేటీఆర్.

Last Updated : Jul 25, 2020, 12:51 PM IST
KTR Ambulance: కేటీఆర్ కొత్త కార్యక్రమం..అదే బాటలో మంత్రులు

Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనావైరస్ ( Coronavirus ) టెస్టింగ్ కోసం తన వంతుగా ఆరు అంబులెన్స్‌లను అందించనున్నట్టు తెలిపారు కేటీఆర్. శుక్రవారం రోజు కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్  ప్రగతిభవన్ ( Pragathi Bhavan ) చేరుకున్నారు. పార్టీ నేతగా, ప్రజల శ్రేయస్సు కోసం తను ఈ అంబులెన్స్‌లను ప్రజలకు అందించన్నట్టు కేటీఆర్ తెలిపారు.  ఈ అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఈటెల రాజేందర్..తన వంతుగా తమ నియోజక వర్గంతో పాటు, కరీంనగర్ జిల్లా పార్టీ తరపున 5 అంబులెన్స్‌లను సమకూరుస్తానన్నారు.

మంత్రి కేటీఆర్ అంబులెన్స్‌లను కరోనా టెస్టింగ్, ఇతర అవసరాలకోసం కేటాయించడాన్ని స్వాగతించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ( Telangana Rastra Samithi ) మంత్రులు తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా 11 అంబులెన్స్‌లను సమకూరుస్తామని ప్రకటించారు. దాంతో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు కూడా 6 అంబులెన్స్‌లను సమకూరుస్తాం అని తెలిపారు. వీరితో పాటు పలువురు తెరాసా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వంతుగా అంబులెన్స్‌లను అందిస్తామన్నారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x