ఎన్నికల ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీపై గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ టీడీపీ అధికారం చేపడుతుందన్నారు. నూటికి నూరు శాతం కాదు...కచ్చితంగా నూటికి 1000 శాతం టీడీపీయే గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తాను సభకు వస్తున్నప్పుడు కనిపించిన జనసందోహం చూస్తుంటే తనకు ధీమా కలుగుతోందని చంద్రబాబు వివరించారు.
ఏప్రిల్ లో రుణమాఫీ నగదు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని జక్కంపూడి కాలనీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన నాలుగో విడత, ఐదో విడత రుణమాఫీ నగదను ఏప్రిల్ తొలి వారంలో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు.