AP Express Catches Fire: విశాఖపట్నం-ఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. రైలు శుక్రవారం (జనవరి 21) ఉదయం నెక్కొండ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందనగా S6 బోగిలో పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ నెక్కొండ స్టేషన్‌లో రైలును నిలిపివేశాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు పరుగులు పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (AP Express) ఎస్6 బోగి వద్ద బ్రేక్ ప్యాడ్స్ జామ్ అవడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించారు. ఫైరింజన్ సాయంతో మంటలు చెలరేగకుండా పొగను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు అరగంట పాటు రైలు నెక్కొండ రైల్వే స్టేషన్‌లోనే నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగను అదుపులోకి తీసుకొచ్చాక తిరిగి రైలు (Indian Railway) ఢిల్లీకి బయలుదేరింది. బోగిలో పొగలు వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యామని ప్రయాణికులు వాపోయారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: టీవీ డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. ఓ మహిళ అందరి ముందే.. (వీడియో)!!


Also Read: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇండియన్ బిజినెస్ టైకూన్ ఎవరో గుర్తుపట్టగలరా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook