Polavaram war:కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. వందలాది గ్రామాలను ముంచెత్తింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నీట మునిగింది. మూడు బ్యారేజీల దగ్గర నిర్మించిన పంప్ హౌజ్ లను వరద ముంచెత్తింది. బురద కప్పేసింది. జలమయం అయిన కాళేశ్వరం పంప్ హౌజ్ ల రిపేర్లకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రులు, నేతలు పరస్పర ఆరోపణలతో కాక రేపుతున్నారు. పోలవరంతో భద్రాచలానికి ముంపు గండం ఉందంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, నేతలు ధీటుగా కౌంటరిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలవరంపై తెలంగామ మంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయంటూ ఎద్దేవా చేశారు. తాము మాత్రం గోదావరికి 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పోలవరం ప్రాజెక్టు దగ్గరే ఉండి కాపాడుకున్నామని తెలిపారు. పరోక్షంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులెవరు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరకు పోలేదనే విధంగా అంబటి రాంబాబు మాట్లాడారు.  పోలవరం ఎత్తుతో  భద్రచలానికి, తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని  అంబటి స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్సు ద్వారానే ఏపీలో కలిపారన్న విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని అన్నారు. 


వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమవుతుందన్న టీడీపీ నేతల ఆరోపణలపై ఘాటుగా స్పందించారు అంబటి రాంబాబు. గత టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వల్లే ప్రాజెక్టు ఆలస్యమవుతుందని చెప్పారు.కాఫర్ డ్యామ్ నిర్మించకుండా  కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించారని... కాని వరదల్లో  అది కొట్టుకు పోయిందని చెప్పారు. చంద్రబాబు 40 సార్లు, దేవినేని ఉమ 90 సార్లు పోలవరం వెళ్లి చేసిందేమి లేదన్నారు. సీఎం జగన్ వచ్చాకే స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పూర్తి చేశామని అంబటి రాంబాబు వివరించారు. 2018 లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పిన దేవినేని ఉమ 5 ఏళ్ల లో ఏం చేశాడో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్ నుంచి ఇంకా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందన్నారు అంబటి రాంబాబు.


Also Read: వ్యాయామం చేస్తూనే.. పంజాబీ పాటకు డాన్స్ చేసిన విరాట్ కోహ్లీ! వరుణ్ ధావన్ ఏమన్నాడంటే


Also Read: Liger Trailer Review: విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ ఎలా ఉందంటే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook