Virat Kohli Dance: వ్యాయామం చేస్తూనే.. పంజాబీ పాటకు డాన్స్ చేసిన విరాట్ కోహ్లీ! వరుణ్ ధావన్ ఏమన్నాడంటే

WI vs IND, Virat Kohli danced Mundiyan song.  విరాట్‌ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబీ పాటకు అద్భుతమైన డ్యాన్స్‌ చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 21, 2022, 02:15 PM IST
  • వ్యాయామం చేస్తూనే
  • పంజాబీ పాటకు డాన్స్ చేసిన విరాట్ కోహ్లీ
  • వరుణ్ ధావన్ ఏమన్నాడంటే
Virat Kohli Dance: వ్యాయామం చేస్తూనే.. పంజాబీ పాటకు డాన్స్ చేసిన విరాట్ కోహ్లీ! వరుణ్ ధావన్ ఏమన్నాడంటే

Varun Dhawan reacted on Virat Kohlis dance: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి పారిస్ వెకేషన్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని అనుష్క తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించారు. పారిస్‌లో ఎండలు మండిపోతున్నాయని, 41 డిగ్రీల ఎండ కొడుతుందని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఇంగ్లండ్ నుంచే నేరుగా పారిస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. 

అయితే విరాట్‌ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబీ పాటకు అద్భుతమైన డ్యాన్స్‌ చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కోహ్లీ వ్యాయామం చేస్తూనే డాన్స్ చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ ఫ్లోర్ మూమెంట్ కూడా వేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ డ్యాన్స్‌ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు విరాట్ డాన్స్ స్టెప్పులకు ఫిదా అయ్యారు. 'బాగా డాన్స్ చేశావ్' అని హీరో వరుణ్ ధావన్ కామెంట్ చేశాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

గత కొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ.. విశ్రాంతి పేరుతో విండీస్‌ పర్యటనకు దూరంగా ఉన్నాడు. క్రికెట్‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటే తిరిగి‌ గాడిలో పడతాడనే ఉద్దేశంతో విండీస్‌ పర్యటనకు వెళ్లకుండా ఫ్యామిలీతో పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మాజీల సలహాల మేరకే బీసీసీఐ కూడా అతడిని విండీస్‌ పర్యటనకు దూరంగా ఉంచింది. దీంతో కోహ్లీ ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. 

Also Read: India vs West Indies: రేపటి నుంచి భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్..టీమిండియా జట్టు ఇదే..!

Also Read: Railway Shock:సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News