Arekapudi Gandhi: నీ బాంచెత్.. రారా తెల్చుకుందాం.. కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయిన అరికెపూడి గాంధీ.. వీడియో వైరల్..
Arekapuri gandhi on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి రచ్చగా మారాయి. అరికెపూడి గాంధీ పాడీ కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
Arekapuri gandhi fires on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీట్ ను పెంచేదిగా మారాయి. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డికు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న .. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు (గురువారం) అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి, బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామంటూ కూడా హెచ్చరించారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు రచ్చగా మారాయి. దీనిపై స్పందించిన.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. అదే రేంజ్ లో సవాల్ విసిరారు.
పాడి కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ.. దమ్ముంటే తన ఇంటికి రావాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా... అతను రాకుంటే.. తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని కూడా సవాల్ విసిరారు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఒక వీడియోను సైతం విడుదల చేశారు. దీంతో ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయాలు రచ్చగా మారాయి.
పూర్తి వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య తగ్గా ఫార్ వార్ నడుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై గతంతో వాళ్లు చేసిన తప్పిదాల వల్లే.. తెలంగాణ అన్నిరంగాల్లో వెనక్కు పోయిందని విమర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలుసైతం కాంగ్రెస్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. మరోవైపు ఇటీవల.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పీఏసీకి చైర్మన్ గా శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించింది. దీంతో ఇది కాస్త రచ్చకు దారితీసింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన, ఎమ్మెల్యేలను వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా, కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా.. దీనిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు.దీనిపై తాజాగా, అరికెపూడిగాంధి, పాడి కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటేతన ఇంటికి రావాలని సవాల్ విసిరారు. నువ్వు రాకుంటే.. నేనే వస్తానని కూడా కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు.
అంతేకాకుండా.. నీ బాంచెత్ రారా.. తెల్చుకుందాం.. ఇది కౌశిక్ రెడ్డికి , నాకు ఇద్దరి మధ్య తీవ్ర సవాళ్ల పర్వం కొనసాగిందని కూడా చెప్పుకొవచ్చు.ఇదిలా ఉండగా.. పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. అరికెపూడి గాంధీ ఇంటి బైట కూడా పోలీసులు భారీ ఎత్తున కట్టుదిట్టమై భద్రత చేపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి.. బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని కూడా, అరికెపూడి మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.