Ktr fires on congress party: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిందని చెప్పుకొవచ్చు. కాంగ్రెస్ ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వల్లే.. ఇలా అన్ని రకాలుగా తెలంగాణ వెనక్కు వెళ్లిందని ఆరోపణలు చేస్తుంది. మరోవైపు దీనిపైన బీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తు.. కేవలం అమలు కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి, తమపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ రేవంత్ టీమ్ వ్యాఖ్యల్ని గట్టిగానే తిప్పికొడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఇటీవల జాన్వాడ రేవ్ పార్టీ  ఘటన తర్వాత మాత్రం తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకొవచ్చు. జాన్వాడ రేవ్ పార్టీ ఘటనలో కేటీఆర్ బావమరిది దొరకడం పట్ల కూడా పలు రాజకీయ పార్టీలు తీవ్ర మైన ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటనలో కేటీఆర్ సతీమణి శైలిమను సైతం పోలీసులు విచారించినట్లు తెలుస్తొంది.


ఇదిలా ఉండగా.. దీనిపై బీఆర్ఎస్ మాత్రం.. అది ఒక ఫ్యామిలీ పార్టీ అని రేవంత్ సర్కారు కావాలని తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఎక్స్ లో.. ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమంతో నెటిజన్ లతో ముచ్చటించారు. కొంత మంది నెటిజన్ లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ తనదైన స్టైల్ లో రిప్లైలు సైతం ఇచ్చారు.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్ని ఎక్కడ చూడలేదని అన్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నవారిని టార్గెట్ చేయడం చూశామని.. కానీ ఇక్కడ  మాత్రం రాజకీయ నేతల బంధువుల్ని సైతం లేనీ పోనీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా..  గతంలో కొన్నిసార్లు... ఇలాంటి రాజకీయాలు వద్దనిపించిందని, ఏకంగా వైదొలగాలనిపించిందన్నారు.


కానీ .. కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీలను ప్రజల ముందుంచి, వారి మెడలు వంచి, ప్రజలకు న్యాయం చేసేలా చూడటమే తమ పని అన్నారు. ఒక నెటిజన్ కేసీఆర్ ఎప్పటి నుంచి యాక్టివ్ గా పాలిటిక్స్ లో వస్తారని అడిగారు. దీనికి కేటీఆర్ సమాధానం చెబుతూ.. వచ్చే ఏడాది నుంచి మళ్లీ కేటీఆర్ యాక్టివ్ రాజకీయా కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు.


Read more: Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు


మరో నెటిజన్ .. మహా రాష్ట్ర ఎన్నికలలో పాల్గొంటారని అడగ్గా.. ప్రస్తుతం తాము తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇక్కడ మళ్లీ బీఆర్ఎస్ ఏర్పాటు చేయడమే తొలి టార్గెట్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కేవలం అబద్దపు హమీలు ఇచ్చి గద్దెనెక్కిందని , ప్రజల ముందు కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టడమే తమ టార్గెట్ అని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం కేటీఆర్ చేసిస వ్యాఖ్యలు దీపావళి వేళ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.