హైదరాబాద్: మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో  పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో  కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  రేపు ఉయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేదించారు. ఈ నేపథ్యంలో కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లులతో మిలటరీ క్యాంటీన్లకు ఇది వర్తిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

144 సెక్షన్ అమలు..


రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. 


హద్దుమీరితే చర్యలు..


144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడటం నిషేధమని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. హద్దుమీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ  అంజనీకుమార్ హెచ్చరించారు. ఇక ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు జరిపితే కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని అదేశాలు జారీ చేశారు.