Big Shock TO Kcr: కేసీఆర్ కు షాక్ ల మీదు షాకులు.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే ! త్వరలో కొందరు సీనియర్లు జంప్?
Big Shock TO Kcr : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి నేతలు ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ కు టాటా చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు.
Big Shock TO Kcr : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి నేతలు ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ కు టాటా చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదేలు.. కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీకి షాగ్ తగిలింది. అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
అశ్వారాపుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా.. టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తర్వాత మెచ్చా కూడా కారు పార్టీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో మెచ్చా, తాటి మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇరు వర్గాల నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని చెబుతూ వస్తున్నారు తాటి వెంకటేశ్వర్లు.
రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ పై పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు తాటి వెంకటేశ్వర్లు. జిల్లాలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అధిష్టానం జోక్యం చేసుకోవాలని అన్నారు. దీంతో తాటి పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అనుమానించినట్లుగానే రెండు రోజుల్లోనే కండువా మార్చేశారు తాటి వెంకటేశ్వర్లు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చాలా రోజుల నుంచి తాటి టచ్ లో ఉన్నారని అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సాగడంతో... అందుకోసం ఎదురుచూశాడని తెలుస్తోంది. పొంగులేటితో ఇటీవల కేటీఆర్ సమావేశం కావడంతో ఆయన కారు పార్టీలోనే ఉంటారనే క్లారిటీ వచ్చింది. దీంతో తాటి తన దారి తాను చూసుకున్నారని చెబుతున్నారు.
వర్గపోరుతో సతమతమవుతున్న పినపాక నియోజకవర్గంలోనూ కారు పార్టీకి షాక్ తగిలింది. కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో మొదటి నుంచి జడ్పీటీసీకి విభేదాలున్నాయి. గత ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అధికార పార్టీలో చేరారు. నియోజకవర్గంలో ఆయన తనతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలపై ప్రాధాన్యత ఇస్తున్నారని టీఆర్ఎస్ పాత నేతలు ఆరోపిస్తున్నారు. రేగా కాంతారావుతో విభేదాలతోనే రాజీనామా చేసిశానని జడ్పీటీసీ కాంతారావు తెలిపారు. ఇద్దరు కీలక నేతల రాజీనామా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. త్వరలోనే మరికొందరు ముఖ్య నేతలు టీఆర్ఎస్ నుంచి బయటికి వస్తారని అంటున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారని.. సమయం చూసుకుని పార్టీ కండువా మార్చేస్తారనే టాక్ వస్తోంది.
Read also: Group Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్.. అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషన్!
Read also: Viral Video: పెళ్లి వేడుకల్లో ఊహించని ఘటన.. వరుడి కాల్పుల్లో జవాన్ మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook