State Bank Of India: గుడ్‌న్యూస్.. ఎస్బీఐలో ఏటీఎం కార్డు లేకపోయినా క్యాష్ విత్ డ్రా ఇలా..!
SBI ATM Cash Withdrawal Rules: ఎస్‌బీఐ ఏటీఎం కార్డులేకపోయినా మీ మొబైల్‌లో యోనో యాప్ ఉంటే.. క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయితే చాలు. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!
SBI ATM Cash Withdrawal Rules: ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో చాలామంది ఏటీఎం కార్డులను ఇంట్లోనే మర్చిపోయి వెళుతున్నారు. మొబైల్‌తోనే యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. అదే మొబైల్ చేతిలో ఉంటే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. మొబైల్‌లో ఎస్‌బీఐ యోనో యాప్ ఉంటే చాలు. ఈ యోనో యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకుని.. మీ సమీపంలోని ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. అయితే ఈ సేవ అన్ని ఏటీఎంలలో అందుబాటులో ఉండదు. యోనో స్టిక్కర్ ఉన్న ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం కార్డును ఇంట్లో మర్చిపోయినా.. మీరు నగదు తీసుకోవచ్చు. మీ వద్ద ఏటీఎం కార్డు లేకపోయినా ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి ఎలా నగదు విత్ డ్రా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
ఏటీఎం కార్డు లేకుండా నగదు విత్ డ్రా చేసుకునే ఈ ఫీచర్‌ని ఇంటర్ పేయబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ICCW) అంటారు. ఈ సరికొత్త ఫీచర్‌తో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేయడం వల్ల జరిగే మోసాలను అరికట్టవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది. కార్డులెస్ క్యాష్ ఇలా విత్ డ్రా చేసుకోండి.
==> ముందుగా మీ ఫోన్‌లో యోనో యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి.
==> మీ నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
==> యోనో క్యాష్ విత్ డ్రా విభాగాన్ని ఎంచుకోవాలి.
==> మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంటర్ చేయండి
==> ఆ తరువాత ఆరు అంకెల పిన్‌ను సెట్ చేసుకోండి
==> మీ సమీపంలోనే ఏటీఎంకు వెళ్లి యోనో క్యాష్ ఆప్షన్‌ను ఎంచుకోండి
==> మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి
==> ఆ తరువాత నగదు ఎంటర్ చేసి.. ఆరు అంకెల పిన్‌ను ఎంటర్ చేయండి
==> ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా అవుతుంది.
Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా
Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి