Kcr Shock: కేంద్ర సర్కార్ పై దూకుడు రాజకీయాలు చేస్తూ హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి సవాల్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంగారెడ్డి అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి లేఖ పంపించారు బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో తెలిపారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడంగ్ పేట అభివృద్ధి కోసమే గతంలో టీఆర్ఎస్ పార్టీ చేరామని పారిజాత నర్సింహారెడ్డి చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేశామని తెలిపారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసినా తమకు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదన్నారు. కొంతకాలంగా తమకు వ్యతిరేకంగా పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయని.. తమ ఎదుగదలను, ప్రజల్లో వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక కొందరు తమపై చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశామని తెలిపారు. త్వరలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరుతామని పారిజాత నర్సింహారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ తెలిపారు. [[{"fid":"236696","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన పారిజాత నర్సింహారెడ్డి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కారెక్కి బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే కొద్ది రోజులుగా మంత్రి సబితతో మేయర్ కు విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం తనకు తెలిసే జరగాలని మేయర్ కు మంత్రి సబిత కండీషన్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. చిన్నచిన్న పనులు కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్నాయి. సబితా తీరుతో మనవేదనకు గురైన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆమె పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచే మేయర్ పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇవాళ అధికారికంగా ప్రకటన వచ్చింది.


Also Read: Anchor Shiva: రాశిఖన్నాతో పులిహోర.. ఏకంగా పెళ్లికి టెండర్ పెట్టాడుగ


Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook