హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చర్చల్లో నిలుస్తున్న(TTD) తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టీటీడీ ఆస్తులను విక్రయించే అధికారం జగన్ సర్కార్‌కు లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిందూ ధర్మం, హిందూవుల ఆలయాలను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఎల్జీ పాలిమర్స్ కు కీలక సూచనలు చేసిన ఏపీ హైకోర్టు..


శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై పెట్టుకున్న వారు బతికి బయడపడిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాంటి హిందూవుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే వారిని దేశం నుంచి తరమికొట్టే రోజులు వస్తాయన్నారు. టీటీడీ ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి, పాస్టర్ల జీతాలకు ఇతరత్రా సదుపాయాలకు వాడుకోవాలనుకోవడం తగదన్నారు. ఈ సందర్బంగా ఆదివారం నాడు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టీటీడీ ఆస్తులను అమ్మాలనుకునే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాగే ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే శ్రీవారి భక్తులతో పాటు హిందూవులను ఏకం చేసి ప్రజా పోరాటానికైనా సంఘటితంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ ఘాటైన హెచ్చరికలు చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..