అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కు ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ (LG Polymer) కంపెనీలో ఇటీవలే స్టెరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలు ఏపీ హైకోర్ట్ సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఈరోజు హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయడంతో పాటు కంపెనీల్లోకి ఎవరిని అనుమతి ఇవ్వొద్దని కోరిందని కోర్ట్ ఆదేశించింది.
Also Read: ఉక్కపోతలతో ఉడుకుతున్న ఢిల్లీ..
మరోవైపు కంపెనీ డైరెక్టర్లను దేశం విడిచి వెళ్లోద్దని ఆదేశించింది. అంతేకాకుండా వారి పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ లీకేజీ తరువాత ఎవరి అనుమతితో స్టెరిన్ గ్యాస్ ను అక్కడి నుంచి తరలించారని, లాక్ డౌన్ తరువాత ఎవరి అనుమతితో ప్రక్రియను ప్రారంభిచారో వివరణతో కూడిన అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఆదేశించింది. దీంతో పాటు అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..