Bandi Sanjay Kumar: మహిళా కమిషన్ విచారణకు బండి సంజయ్.. అలాంటిదేం జరగలేదట
Bandi Sanjay Press Meet: తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను అని తెలిపారు.
Bandi Sanjay Press Meet: హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆ అంశంపై స్పందించే క్రమంలో తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో శనివారం బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళ కమిషన్ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడినట్టుగా వార్తలొచ్చాయి.
అయితే, విచారణలో తనపై రాష్ట్ర మహిళా కమిషన్ మండిపడింది అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. మహిళా కమిషన్ తనపై ఆగ్రహం వ్యక్తంచేసిందన్న ప్రచారంలో వాస్తవం లేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. రాజ్యాంగబద్దంగా, స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై తనకు గౌరవం ఉందని.. ఆ గౌరవంతోనే తాను మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యానని అన్నారు. తాను చేసిన పనితో ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయని భావించానని.. కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు అని తనపై దుష్ప్రచారం చేసే వారికి బండి సంజయ్ హితవు పలికారు.
తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వివరణను మహిళా కమిషన్ రికార్డు చేసింది. సుహ్రుద్బావ వాతావరణంలో విచారణ జరిగిందని.. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని బండి సంజయ్ మీడియాకు తెలిపారు.
ఇదిలావుంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్టుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి చేతిలో శనివారం మరో ట్విస్ట్ ఎదురైంది. ఎమ్మెల్సీ కవిత ఈడిని తప్పుపడుతూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయకూడదు అని విజ్ఞప్తి చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుప్రీం కోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో ఎదురుదెబ్బ
ఇది కూడా చదవండి : Revanth Reddy Slams KTR: మేము తెలంగాణ ఇయ్యకుంటే మీరు బిచ్చమెత్తుకోవాల్సి వచ్చేదన్న రేవంత్ రెడ్డి
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైడ్రామా.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK