Bandi Sanjay Kumar Gift: తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు కేంద్ర మంత్రి, కరీంనగర ఎంపీ బండి సంజయ్ కుమార్‌ అండగా నిలిచారు. తన విజయానికి ఉత్సాహంగా పని చేసిన పార్టీ కార్యకర్తలకు సంజయ్‌ కానుకలు ఇచ్చారు. ముఖ్యమంత్రులు, మంత్రులు మోకరిల్లినా బెదరకుండా తన గెలుపు కోసం పాటుపడిన పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వారిని అభినందించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: తాను తవ్వుకున్న గుంతలోనే రేవంత్‌ పడుతున్నాడు: హరీశ్‌ రావు స్ట్రాంగ్ కౌంటర్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం బీజేపీ కార్యకర్తలకు ‘ప్రజాస్వామ్య కానుక’ను అందించారు. లోక్‌సభ ఎన్నికల్లో 80 శాతం కంటే అధికంగా పోలింగ్‌ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మాంచారు. వారికి రూ.పది వేల చొప్పున నగదు ప్రోత్సహకం కూడా అందించారు.

Also Read: KTR Challenge: నిమజ్జనం సాక్షిగా రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం: కేటీఆర్‌ సంచలన ప్రకటన


 


ఎన్నికల సందర్భంగా ‘మీకు నచ్చితే ఏ పార్టీకైనా ఓటేయండి. అభ్యంతరం లేదు. కానీ తప్పనిసరిగా ఓటు మాత్రం వేయండి’ అని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘నా పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఏ పోలింగ్ బూత్‌లోనైతే 80 శాతం, అంతకుమించి ఓట్లు పోలవుతాయనే ఆ పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకంతోపాటు ఘనంగా సత్కరిస్తా’ అని ప్రకటించారు. ఆ ప్రకటనలో భాగంగా 80 శాతానికిపైగా ఓట్లు పోలయిన వారిని పిలిచి సన్మానించారు.


ప్రధాని జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ 15 రోజుల పాటు ‘సేవా పఖ్వాడ’ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండగా వాటిలో భాగంగా బుధవారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్‌లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యులను పిలిచి సన్మానించారు. ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా పర్యటించినా కార్యకర్తల శ్రమ ఫలితంగా 2 లక్షల 20 వేలకుపైగా మెజారిటీ వచ్చిందని బండి సంజయ్‌ గుర్తు చేశారు. భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మీ పోలింగ్ బూత్ పరిధిలో అత్యధిక ఓట్లు పోలయ్యేలా చేసి కరీంనగర్ పార్లమెంట్‌ను దేశంలోనే అగ్రభాగాన నిలపాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter