Bandi Sanjay: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
GHMC Elections 2020: Bandi Sanjay comments: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోనుందని (TRS government).. వెంటనే మధ్యంతర ఎన్నికలు సైతం వస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రాంనగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబడదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుబాటు చేస్తారంటూ ఆయన పేర్కొన్నారు. Also read: GHMC Elections 2020: బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు
ఆదివారం హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం జాగ్రత్త అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. కేంద్రం త్వరలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందని పేర్కొన్నారు. భారత్ బయోటెక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అయితే ట్యాంక్‌బండ్ విగ్రహాలను ముట్టుకుంటే.. ఖచ్చితంగా దారుస్సాలాంను కూల్చేస్తామని మరోసారి బండి సంజయ్ హెచ్చరించారు. ఎవరికీ భయపడేది లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు. ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని.. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు. Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe