Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్ వరదల సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) అనగానే ఓట్ల కోసం నగరవాసులు గుర్తుకొచ్చారా అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రశ్నించారు.

Last Updated : Nov 27, 2020, 09:26 AM IST
  • గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పెరుగుతున్న రాజకీయ వేడి
  • మతతత్వ పార్టీ, ఉగ్రవాదం అంశాలపై స్పందించిన అసదుద్దీన్
  • ఉగ్రవాదానికి, మతానికి సంబంధం లేదంటున్న హైదరాబాద్ ఎంపీ
Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!

జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండగా రాజకీయ వేడి పెరిగింది. ఎంఐఎం పార్టీపై ఇతరత్ర పార్టీలు చేసిన విమర్శలు, ఆరోపణలపై ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి మతానికి ఏ సంబంధం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఉగ్రవాదానికి మతం ఉందంటూ కొన్ని రాజకీయ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ఒక మతానికి జత చేయడం తగదని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. కానీ కొందరు మజ్లిస్‌ అంటే ఓ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

 

గ్రేటర్‌ ఎన్నికల (GHMC Elections) ప్రచారంలో భాగంగా గురువారం ఎర్రగడ్డలో నిర్వహించిన సభలో అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మాట్లాడారు. కేవలం హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఏఐఎంఐఎం (AIMIM) అని పేర్కొన్నారు. మనుషులను కలిపేందుకు తమ పార్టీ యత్నిస్తుంటే.. వర్గాల మధ్య విభేదాలతో రెచ్చగొట్టేందుకు కొందరు జోరుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 1960 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీకి మతతత్వం, ఉగ్రవాదాన్ని అంటగడుతూ ప్రచారం చేయడం తగదన్నారు. 

Also Read : Twitter Blue Ticks: ట్విట్టర్‌లో బ్లూ టిక్ వీరికి మాత్రమే.. ఎవరికో తెలుసా?

 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్, స్థానిక సమస్యలకు బదులుగా బీజేపీ నేతలు ఉగ్రవాదం, సర్జికల్ దాడుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గత ఆరు దశాబ్దాలుగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తమ పార్టీపై బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడితే తనను జిన్నా అని సంబోధిస్తూ ప్రచారం చేయడం సబబేనా అని ప్రశ్నించారు. వరదలు వస్తే హైదరాబాద్‌ వాసులకు సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రం ఇక్కడికి క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read : Gold Price Today: మళ్లీ పతనమైన బంగారం ధరలు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News