Bandi Sanjay on munugode Bypolls: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తలొగ్గి నడుచుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టినప్పటికీ, మద్యాన్ని ఏరులై పారించినప్పటికీ ఎన్నికల ప్రధాన అధికారిక అసలు ఏ మాత్రం పట్టించుకోలేదని బండి సంజయ్ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు డబ్బులివ్వడం, తీసుకోవడం నేరమని చెప్పిన ఎన్నికల కమిషన్ చూస్తూ మౌనంగా ఉండటం నేరం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రధానాధికారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్రానికి తప్పకుండా ఫిర్యాదు చేస్తామని చెబుతూ గులాబీలకు గులాంగిరి చేసేటోళ్ల అంతు చూస్తామని హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీనే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాస్వామ్యస్పూర్తిని కాపాడిన ఓటర్లకు హ్యాట్సాఫ్ చెప్పిన ఆయన.. దాడులు, అరాచకాలపై పోరాడిన బీజేపీ కార్యకర్తలకు, యువతకు సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసులను ఉపయోగించుకుని టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, ఎన్ని దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేసినా.. వాటికి భయపడకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.


టీఆర్ఎస్ తొత్తులుగా మారి లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా, లాఠీఛార్జ్ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ నేతలకు తొత్తులుగా మారి గులాంగిరీ చేసే అధికారులు, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. 


ఆ విషయం తెలిసే టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు
బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారు. 200 మంది టీఆర్ఎస్ గూండాలు సిద్దిపేట నుండి మునుగోడుకు వచ్చి అరాచకం సృష్టించారని అన్నారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలు చూసి కూడా ఏమీ ఎరుగనట్టే వ్యవహరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఒక్కో ఓటుకు రూ.30 వేలు పంచిపెట్టినప్పటికీ, బంగారం బిస్కెట్లు ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం బీజేపీని గెలిపించబోతున్నారని అన్నారు. బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మునుగోడుకు ఎమ్మెల్యే కాబోతున్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుస్తారనే విషయం తెలిసే టీఆర్ఎస్ గూండాలు మద్యం సేవించి డిప్రెషన్‌లోదాడులకు పాల్పడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. పోలింగ్ సమయంలోనే ఓటర్లకు ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేసిన ట్విట్టర్ టిల్లుపై చర్య తీసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు. మర్రిగూడ మండలం అంతంపేట గ్రామ పరిధిలోని ఆమ్లెట్ తండాలైన రంగం తండా, అజీనా తండాలకు రోడ్లు లేవని నిరసన వ్యక్తంచేస్తూ ఆ రెండు తండాల వాసులు ఓటింగ్‌కి దూరంగా ఉండటంతో రోడ్లు వేయిస్తానని మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా  హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ ( Bandi Sanjay ) ఈ వ్యాఖ్యలు చేశారు. 


Also Read : Munugode ByPoll Live Updates: కేసీఆర్ ప్రెస్ మీట్.. బీజేపిపై సంచలన ఆరోపణలు


Also Read : KCR Press meet: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ ప్రెస్ మీట్.. గెలుపు ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు


Also Read : Rajagopal Reddy: ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి.. కారణం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి