Munugode ByPoll Live Updates: కేసీఆర్ ప్రెస్ మీట్.. బీజేపిపై సంచలన ఆరోపణలు

Munugode By Elections Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు ఉదయం నుంచే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే, పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీజేపిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన ఆరోపణలు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2022, 11:15 PM IST
Munugode ByPoll Live Updates: కేసీఆర్ ప్రెస్ మీట్.. బీజేపిపై సంచలన ఆరోపణలు
Live Blog

Munugode By Elections Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నికల సరళిపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నింటికిమించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీజేపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు, మూడు రోజుల ముందే ఈ విషయాలను చెప్పాలనుకున్నప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే తాను ప్రెస్ మీట్ పెట్టానని సంకుచిత స్వభావం ఉన్న వ్యక్తులు నీచమైన వ్యాఖ్యలు చేస్తారనే ఉద్దేశంతోనే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేవరకు వేచిచూసినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

3 November, 2022

  • 21:17 PM

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందిస్తూ కేసీఆర్ ప్రెస్ మీట్‌లో ఏమన్నారంటే

     

  • 21:02 PM

    KCR Press meet Live Updates: 

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ 

    ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ 

    భారమైన హృదయంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నానని వ్యాఖ్యానించిన కేసీఆర్. 

    తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదన్న కేసీఆర్.

    ఈ రోజు దేశంలో జరుగుతున్న ఈ దుర్మార్గం ఏదైతే ఉందో.. అది ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం అని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్. 

    మన ఊహకు కూడా అందనంత దుర్మార్గం దేశంలో ఉంది. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి బీజేపి దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని కేసీఆర్ వ్యాఖ్యలు. 

    రూపాయి విలువ అట్టుడుగుకు పడిపోయింది. భారత దేశం ఆకలి రాజ్యంగా మారుతోంది. ఇది సరిపోదన్నట్టు ప్రజలను విభజించి పాలించడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేసిన కేసీఆర్.

  • 19:37 PM

    మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాత్రి 8 గంటలకు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్ 

  • 19:15 PM

    Munugode ByPoll Live Updates: మర్రిగూడ మండలం అంతంపేట గ్రామ పరిధిలోని ఆమ్లెట్ తండాలైన రంగం తండా, అజీనా తండాలకు రోడ్లు లేవని నిరసన వ్యక్తంచేస్తూ ఓటింగ్‌కి దూరంగా ఉండటంతో రోడ్లు వేస్తానని మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా  హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన హామీతో ఓటింగ్ ముగిసే సమయంలో ఓట్లు వేయడానికి వెళ్లిన రెండు తండాల ప్రజలు.

  • 19:05 PM

    ఎగ్జిట్ పోల్స్ ప్రసారంపై సీఈఓ క్లారిటీ
    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అరగంట తరువాత (6:30pm) ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేసుకోవచ్చు అని సీఈఓ కార్యాలయం ప్రకటించింది.

  • 17:19 PM

    మర్రిగూడెం మండలం శివన్న గూడెంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రంలో  ఓటిగ్ సరళిని పరిశీలిస్తుండగా.. ఎందుకు వచ్చావంటూ టీఆర్ఎస్ నేతలు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయనపైకి దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

  • 17:17 PM

    మునుగోడులో రికార్డుస్థాయిలో పోలింగ్ దిశగా సాగుతోంది. సాయంత్రం ఐదు గంటలకు 77.55 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 241805 ఓట్లు ఉండగా.. 1,87527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 16:46 PM

    మునుగోడు పోలింగ్ నేపథ్యంలో చండూరులో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాన్ లోకల్స్‌ను బయటకు పంపకుండా టీఆర్ఎస్‌ నాయకులు అడ్డుకుంటున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. 
     

  • 16:46 PM

    మునుగోడు పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ఓవరాక్షన్. జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలింగ్  కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి KA పాల్ బయటకు నెట్టేశారు. సిబ్బందిని పోలింగ్ ప్రక్రియ వివరాలు కేఏ పాల్ అడగ్గా.. పోలింగ్ బూత్ నుంచి బయటికి వెళ్లాలంటూ పోలింగ్ సిబ్బంది నెట్టేశారు. పోలింగ్ సిబ్బంది తీరుపై  కేఏ పాల్ అసహనం వ్యక్తం చేశారు.
     

  • 16:38 PM

    మర్రిగూడ  మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు అధికారులపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. సిద్దిపేట నుంచి వచ్చిన నేతలను వెనక్కి పంపించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు నాటకాలు ఆడుతున్నారని.. ఊడిగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
     

  • 16:18 PM

    మునుగోడు ఎన్నికల పోలింగ్ ముగిసే సమయం దగ్గరపడుతోంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసేందుకు ఎక్కువ సమయం పడుతుతుండడంతో క్యూలైన్‌లు భారీగా పెరిగాయి. దీంతో నాంపల్లి మండలం వడ్డేపల్లి పోలింగ్ కేంద్రం ఓటర్లు నిరసన తెలిపారు. 
     

  • 16:14 PM

    సంస్థాన్ నారాయణపురంలోని జడ్పీ పాఠశాలలో ఈవీఎంలు మోరాయిస్తుండడంతో ఓటర్లు భారీగా క్యూలైన్‌లో నిల్చున్నారు. అధికారులు వెంటనే మరమ్మతు చేపట్టారు. పోలింగ్ ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
     

  • 15:57 PM

    మర్రిగూడెం మండలంలోని దామర భీమనపల్లి గ్రామంలో కారులో మద్యాన్ని బీజేపీ నాయకులు పట్టుకున్నారు. ఆ కారు టీఆర్ఎస్ ఎంపీ చెందినదని వారు ఆరోపిస్తున్నారు.
     

  • 15:55 PM

    సమస్యలు పరిషంచడంలేదని ఎన్నికలను బహిష్కరించిన గట్టుప్పల్ మండలం రంగంతండా గ్రామస్తులతో మంత్రి కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. మొదట పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే గ్రామ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
     

  • 15:54 PM

    చండూర్ మండలం బంగారిగడ్డ లో ఓటర్ల ఆందోళనకు దిగారు. డబ్బులు రాలేదని ఓటు వేయకుండా నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తం నెలకొంది.

  • 15:19 PM

    మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఓట్లు 2,41,805 ఉండగా.. 1,44,878 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
     

  • 14:49 PM

    బీజేపీ నాయకులపై ఈసీకి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. బీజేపీ మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంచుతుందోని ఎంపీ ఆరోపించారు. డబ్బులు, మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోందని.. ఇది మోడీ, అమిత్ షా ప్లాన్ అని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలు అందరూ తమకే ఓట్లు వేశారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే వాళ్లకి వణుకు పుడుతుందని.. ఇప్పటికైనా అరాచకాలు ఆపాలన్నారు.

  • 14:46 PM

    మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ డబ్బులు పంపిణీ చేస్తోందని మంత్రి జగదీశ్ ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో మాట్లాడారు. చౌటుప్పల్, జనగామ, చండూరు, తమ్మలపల్లిలో డబ్బుల పంపిణీ జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా నిబంధలనలకు విరుద్ధంగా ధర్నాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.  
     

  • 14:21 PM
  • 14:00 PM

    నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండాలో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని తమ సమస్యలను చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమంటూ  స్పష్టం చేస్తున్నారు. రంగంతండాలో మొత్తం 320  ఓట్లు ఉన్నాయి.
     

  • 13:58 PM
  • 13:33 PM

    మునుగోడు నియోజకవర్గంలో 42 మంది నాన్ లోకల్స్‌ను గుర్తించి బయటకు పంపించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మూడు చోట్ల ఈవీఎంలను మార్చి పోలింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఒక చోట వీవీ ప్యాట్.. మరోచోట ఈవీఎంలో సమస్య వచ్చిందని సరిచేస్తున్నామన్నారు.
     

  • 13:12 PM

    మునుగోడు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.30 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 12:54 PM

    మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఈఓ వికాస్‌ రాజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. 
     

  • 12:46 PM

    ఈవీఎం మెషిన్‌లో లోపం కారణంగా చిన్నకొండూరు గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్‌ పునఃప్రారంభం కోసం ఓటర్లు నేలపైనే కూర్చుండిపోయారు. ఇప్పటివరకు మూడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలో లోపాలున్నట్లు సమాచారం.
     

  • 12:45 PM

    మర్రిగూడలో స్థానికేతరులు ఉన్నారని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రెండు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు.
     

  • 12:43 PM

    చండూరు మండలం బంగారిగడ్డ లో లెనిన్ కాలనీలో మహిళలు నిరసనకు దిగారు. బీజేపీ నుంచి తమకు డబ్బులు అందలేదన్నారు. మొదటి నుంచి తులం బంగారం లేదా ఓటుకు 30 వేల నుంచి 40 వేల రూపాయలు ఇస్తారని ఆశపెట్టిన నాయకులు.. ఇప్పుడు ఇవ్వడం లేదని తమకు డబ్బులు ఇవ్వని పక్షంలో ఓటు ఎవరికి వేయమని స్పష్టం చేశారు.

  • 12:30 PM

    మునుగోడులో ఓ వైపు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. మరోవైపు డబ్బులు, మద్యం పంపకాలు జోరుగా సాగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి వాటిపై 18004251442 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. 

  • 12:29 PM

    తనపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎవరు నమ్మొద్దని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలబడతారని ఆయన అన్నారు.  

  • 11:56 AM

    గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు వింత నిరసనకు దిగారు. తమకు ఏ పార్టీ నాయకులు డబ్బులు ఇవ్వలేదని.. అందుకే తాము ఓటు వేయమని భీష్మించుకుర్చున్నారు. ఓటు వేసేందుకు ఎవరు ముందుకు రాకపోవంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అందరూ ఓటు వేయాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 

  • 11:56 AM

    మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్, సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
     

  • 11:42 AM

    చండూర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఓ మహిళ ఇబ్బందిపడ్డారు. పోలీస్ సెంటర్‌ గేట్ వద్ద కాలు ఇరుక్కుపోగా.. వెంటనే స్థానికులు ఆమెను రక్షించారు. 

  • 11:39 AM

    మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. మార్పు కోసం ఓటు వేయాలంటూ కోరారు. ఒకే రోజు 100 పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
     

  • 11:38 AM

    మునుగోడులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన.. ఈవీఎం సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. నాన్ లోకల్స్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఆరుగురికి అరెస్ట్ చేశామన్నారు
     

  • 11:35 AM

    మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు జోరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 25.80 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారలు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
     

  • 11:15 AM

    మునుగోడు ఉపఎన్నికలో తొలిసారి మహిళల కోసమే ఓ ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం విశేషం. నారాయణపూర్‌లో సఖీ పోలింగ్ స్టేషన్‌లో కేవలం మహిళలు మాత్రమే ఓటు హక్కు వినియోగంచుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా అందరూ మహిళలే. రాష్ట్రంలో మునుగోడులోనే తొలిసారి మహిళలకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
     

  • 11:11 AM

    నాంపల్లి మండలం మల్లాపూర్ రాజపల్లి కారులో రూ.`10 లక్షల నగదు పట్టుబడింది. టీఆర్ఎస్‌ నాయకులు డబ్బులు పంపిణీ పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు వాహనాన్ని అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది.

    మునుగోడు ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీ ప్రచారం తరువాత నేడు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది.

Trending News