Bandi Sanjay about CM KCR's districts tours: హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీజేపికి భయపడ్డారని, అందువల్లే ఇటీవల గడీల నుంచి బయటికి వచ్చి జిల్లాల్లో పర్యటిస్తున్నారని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతీ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వమే నిధులు అందిస్తోందని.. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు అని మండిపడ్డారు. 18 సంవత్సరాలు దాటిన యువతీయువకులు ఆరోగ్యం సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు. అందుకే వారికి కరోనా వాక్సిన్ డ్రైవ్ (Corona vaccine for 18+ age group) ప్రారంభించ లేదు అని బండి సంజయ్ ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రమే నిధులు సమకూరుస్తున్నప్పటికీ.. సీఎం కేసీఆర్‌కు కనీస కృతజ్ఞత లేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలు (Huzurabad bypolls) సహా వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపికే పట్టం కట్టబోతున్నారని అన్నారు. 


కేంద్ర ప్రభుత్వం గురించి బండి సంజయ్ మాట్లాడుతూ.. భారత్‌ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని అన్నారు. 2014 తర్వాత దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది అని బండి సంజయ్ (Bandi Sanjay) అభిప్రాయపడ్డారు.