Bandi Sanjay's Son Booked: బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగిరథ్ పై కేసు నమోదైంది. తాను బిటెక్ చదువుకుంటున్న మహింద్రా యూనివర్శిటీలో జూనియర్ విద్యార్థిపై చేయి చేసుకున్న వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు.. బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన మహింద్రా యూనివర్శిటీ దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండటంతో దుండిగల్ పిఎస్ లోనే బండి సాయి భగీరథ్ పై ఐపిసి సెక్షన్స్ 341, 323, 504, 506 r/w 34 కింద కేసు నమోదు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగింది ? సాయి భగీరథ్ ఎందుకు చేయి చేసుకున్నాడు ?
బండి సాయి భగిరథ్ తన జూనియర్ విద్యార్థిపై దుర్షాషలాడుతూ దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతోందని తెలుస్తోంది. తన ఫ్రెండ్ చెల్లిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడనే కారణంతోనే సాయి భగీరథ్ ఆ కుర్రాడిపై దాడికి పాల్పడినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు సాయి భగిరథ్ చేతిలో దాడికి గురైన బాధిత విద్యార్థి సైతం తన తప్పు తెలుసుకున్నాడని.. అందువల్లే ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదనేది ఆ సమాచారం సారాంశం.


ఇప్పుడెవరు లీక్ చేశారు.. ఎందుకు చేశారు.. ఆ అవసరం ఎవరికి ఉంది ?
ఈ ఘటనలో దాడికి పాల్పడిన యువకుడు బండి సాయి భగీరథ్ బండి సంజయ్ తనయుడు కావడంతో రాజకీయంగా బండి సంజయ్ ని దెబ్బకొట్టేందుకు ఇప్పుడు ఈ వీడియోను లీక్ చేశారని.. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తమే ఉండి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బాధిత యువకుడు ఫిర్యాదు చేయనప్పటికీ.. అప్పుడు వెలుగుచూడని ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకొచ్చిందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని తలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. బండి సంజయ్ కుమార్ ఏమని స్పందించనున్నారు, మున్ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో వేచిచూడాల్సిందే మరి.


ఇది కూడా చదవండి : Man Dragged Behind Scooter: ఎంత అరాచకం.. మిట్ట మధ్యాహ్నం వృద్ధుడిని రోడ్డుపై స్కూటీతో లాక్కెళ్లాడు


ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్


ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook