Bandla Ganesh: తెలుగు హీరోలకు బండ్ల గణేష్ మాస్ వార్నింగ్ .. మా రేవంత్ అన్నకు విషెస్ చెప్పరా..
Bandla Ganesh: తెలుగు హీరోలకు బండ్ల గణేష్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువరు బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ తెలుగు సినీ ప్రముఖ హీరోలైన కొంత మంది చెప్పక పోవడంపై బండ్ల గణేష్ ఆయా హీరోలపై ఫైర్ అవుతున్నారు.
Bandla Ganesh: తెలుగు సినీ ప్రముఖులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు నటుడు కమ్ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. ఈ నెల 8న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్బంగా పలువరు శుభాకాంక్షులు తెలిపారు. మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలియజేసారు. అటు మహేష్ బాబు కూడా రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షులు తెలియజేసిన వాళ్లలో ఉన్నారు. కానీ కొంత మంది హీరోలు, నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఎలాంటి విషెస్ తెలియజేయలేదు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపని సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టికెట్లు పెంచుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి కావాలి...కానీ పుట్టిన రోజు మాత్రం గుర్తుకు రాదా అంటూ సీరియస్ అయ్యారు. రీసెంట్ గా నాగార్జున ఎన్ కన్వేషన్ కూల్చివేత, సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు..గద్దర్ అవార్డులు వంటివి కాంగ్రెస్ పార్టీకి...సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బండ్ల గణేష్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున బర్త్ డే విషెస్ తెలియజేయలేదు అంటే ఈ ఇష్యూస్ ఉన్నాయి కాబట్ట సరిపెట్టుకోవచ్చు. కానీ తెలంగాణలో ఖమ్మం ఎంపీ రామసహాయం.. వెంకటేష్ కు స్వయానా వియ్యంకుడు. అటు పొంగులేటి కూడా వెంకటేష్ కు రిలేటివ్ అవుతారు. ఆయన ఎందుకు చెప్పలేదనే టాక్ నడుస్తోంది. ఇక వెంకటేష్ కు తెలుగు దేశం, బీజేపీ నేతలైన పురంధేశ్వరి, చంద్రబాబు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలున్నాయి.
మరోవైపు కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పినా.. బాలయ్య మాత్రం తన ఫేస్ బుక్ లో ఎలాంటి విషెస్ చెప్పలేదు. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటివారు ఎవరు బర్త్ డే విషెస్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేయలేదు. అయితే.. ముఖ్యమంత్రి అయినంత మాత్రానా.. బర్త్ డే విషెస్ చెప్పాలనే నియమం అంటూ ఏమి లేదు. ఏది ఏమైనా మనసులోంచి ఎవరికైనా బర్త్ డే విషెస్ చెప్పాలి కానీ.. బలవంతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనడం పెద్ద విడ్డూరం అంటున్నారు. ఇలా బండ్ల గణేష్ ఎక్స్ వేదిక స్పందించడం వల్ల రేవంత్ రెడ్డి పరువును బజారుకు ఈడ్చాడనే ప్రశ్న తలెత్తుతుంది. ఏది ఏమైనా బండ్ల గణేష్ వ్యాఖ్యలు చూస్తుంటే.. సీఎంకు బర్త్ డే విషెస్ తెలియజేయకుంటే.. మీ సినిమాలు ఎలా ఆడనీయమని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇదంత రేవంత్ రెడ్డి.. బండ్ల గణేష్ వెనకాల ఉండి.. ఈ తతంగం నడిపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా బర్త్ డే విషెస్ చెప్పకపోయినంత మాత్రానా ఏదైనా కొంపలు మునిగిపోయినట్టు ప్రవర్తించడం విడ్డూరంగా ఉంది. బర్త్ డే విషెస్ కాకుండా ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.