BASARA IIIT PROTEST: సరస్వతి నిలయం రణ క్షేత్రంగా మారింది. నిరసనలతో మార్మోగుతోంది. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటి వద్ద రెండవ  రోజు  విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని,  రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ తో పాటు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు అద్యాపక  సిబ్బందిని నియమించాలని  విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండవ రోజు  రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్ గేట్లకు తాళం వేసి విద్యార్థులను బయటకు రాకుండా నిలిపివేశారు. దీంతో అర్జీయూకేటి ప్రధాన గేటు వద్దకు చేరుకున్న విద్యార్థులు.. ముఖ్యమంత్రి లేదా కేటీఆర్ క్యాంపస్ కు రావాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు విని వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రిపుల్ ఐటి వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన ఎబివిపి కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. బాసర, ముధోల్ స్టేషన్లకు తరలించారు. బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఆయన  భరోసా ఇచ్చారు. ఆర్జీయూకేటీ సమస్యలపై స్పందించాలని ట్వీట్ ద్వారా తనకు విజ్ఞప్తి చేసిన విద్యార్థికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగంమలో మౌలిక వసతులు పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీ విద్యార్థుల లేవనెత్తిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ. విద్యార్థులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.  



Read also : TELANGANA CONG LIST:తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. ? పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన జాబితా లీక్..? 


Read also : UGC OFFER: విద్యార్థులకు సూపర్ న్యూస్.. పీజీ లేకుండానే పీహెచ్‌డీ .. యూజీసీ బంపర్ ఆఫర్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook