UGC OFFER: డిగ్రీతోనే చదువు ఆగిపోయిందా.. అనివార్య కారణాలతో పీజీ చేయలేకపోయారా.. మీకు పీహెచ్ డీ చేయాలని ఉందా.. అయితీ మీకో గుడ్ న్యూస్. పీహెచ్ డీ కోర్టుకు సంబంధించి విద్యార్థులకు ప్రయోజనం దక్కేలా యూనియన్ గ్రాంట్స్ కమిషన్ .. యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవకున్నా.. హెచ్‌డీ చేసే అవకాశం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించింది.
యూజీసీ తాజా నిర్ణయం ప్రకారం నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో 7.5/10 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారు పీహెచ్‌డీకి అర్హులు.ఇందులోనూ కొన్ని వర్గాలకు మినహాయింపులు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు సీజీఏ 0.5 శాతం తక్కువగా ఉన్నా.. అంటే ఏడు శాతం ఉన్నా పీహెచ్ డీ కోర్సుకు అనుమతి ఇస్తారు. పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి ‘యూజీసీ నిబంధనలు - 2022’ను జూన్ నెలాఖరు వరకు ప్రకటించనున్నారు. కొత్త విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన విద్యార్థులు పరిశోధనల వైపు మొగ్గుచూపేలా యూజీసీ తాజా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలు పెరుగుతాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
Read also:TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్... చెక్ చేసుకోండి ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook