No School Holiday: సామాజిక మాధ్యమాలతోపాటు కొన్ని మీడియాలో రేపు బుధవారం పాఠశాలలకు సెలవు అనే వార్త అని ప్రచారం జరిగింది. మాఘ మాసంలో వచ్చిన మౌని అమావాస్య సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారని వార్తలు చక్కర్లు కొట్టాయి. శ్రవణ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు ప్రకటించారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్‌గా మారడంతో ఎట్టకేలకు విద్యా శాఖ స్పందించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mutton Biryani: పెళ్లి విందులో 'మటన్‌ బిర్యానీ' లొల్లి.. ఆగిపోయిన రిసెప్షన్‌ వేడుక


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల విద్యా శాఖ అధికారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేస్తూ డీఈఓలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొందరు హెడ్‌ మాస్టర్లు స్థానికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. మాఘమాసం సందర్భంగా సెలవు ప్రకటించారనే వార్తల్లో ఎలాంటి సత్యం లేదని స్పష్టం చేసింది.

Also Read: Free Bus Scheme: మహిళలకు భారీ షాక్‌.. తెలంగాణలో ఆర్టీసీ ఫ్రీ బస్సు బంద్‌?


రేపు ఎలాంటి సెలవు ఇవ్వకుండా ఎంఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డీఈఓలకు విద్యా శాఖ ఆదేశించింది. వార్షిక పరీక్షలకు సిద్ధమవడానికి విద్యార్థులకు ఇది కీలక సమయం అని గుర్తు చేసింది. ఈ సమయంలో విద్యార్థులకు సెలవులు ఇవ్వడం సరికాదని పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలతోపాటు ఉన్నత పాఠశాలలకు ఎలాంటి సెలవు లేదని ఈ సందర్భంగా విద్యా శాఖ జారీ చేసిన ఆదేశాల్లో ప్రకటించింది. విద్యా శాఖ ప్రకటనతో సెలవు అని జోష్‌లో ఉన్న విద్యార్థులకు ఈ ప్రకటన భారీ షాక్‌ ఇచ్చింది.

అయితే సెలవు వార్త అనేది ఎలా ప్రచారంలోకి వెళ్లిందనేది విద్యా శాఖకు అంతుచిక్కడం లేదు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం నాగోబా జాతర ఉంది. ఈ జాతరకు అక్కడ సెలవు ఇచ్చి ఉంటే మాత్రం అది రాష్ట్రవ్యాప్తంగా ఎలా ప్రకటించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. విద్యార్థులను తప్పుదారి పట్టించే వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.