New Ration Cards in Telangana: రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కొత్తమార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పాత రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్‌ కార్డుల మంజూరు చేయనుందట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఉచిత బస్‌ ప్రారంభించిన రేవంత్‌ సర్కార్‌ ఆ తర్వాత రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త రేషన్‌ కార్డులను ఎన్నికల కోడ్‌ తర్వాత ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పాత రేషన్‌ కార్డుల రూపు రేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త రేషన్‌ కార్డుల జారీతో పాటు పాత రేషన్‌ కార్డులను మార్చి కొత్త రూపంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేషన్‌ కార్డులపై తనదైన ముద్ర వేసుకోవాలని రేవంత్‌ ప్రభుత్వం ఈ చర్యలకు శ్రీకారం చుట్టుంది. ఈ నేపథ్యలో ఆరు గ్యారంటీలను కూడా త్వరగా అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న టీఎస్‌ రిజిస్ట్రేషన్లు మారిపోయి టీజీ కూడా మారిపోయాయి. ఈ తరహాలోనే పాత రేషన్‌ కార్డులను కూడా పూర్తిగా మార్చేయనుందట రేవంత్‌ సర్కార్‌ .


ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..


ఎన్నికల కోడ్‌ తర్వాత కొత్త రేషన్‌ కార్డులతోపాటు పాత కార్డుల రూపాన్ని సమూలంగా మార్చి తమదైన ముద్ర వేసుకోవాలని రేవంత్‌ సర్కార్‌ యోచిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ కార్డుల్లో ప్రస్తుతం కుటుంబ సభ్యులు, వారి వివరాలు ఉండేవి. ఈ కొత్త రేషన్‌ కార్డులో కొన్ని మార్పులు చేయనుంది. ఇక ఆహార భద్రతా కార్డులు తెలంగాణలో కొత్త రూపంలో దర్శనమివ్వనున్నాయి. పాత రేషన్‌ కార్డులతో పాటు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయనుంది. అభయ హస్తంలో భాగంగా వచ్చిన అప్లకేషన్లు దాదాపు 90 లక్షలకు పైగా ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయి.


ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..


వీటిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయనుంది. ముందుగా పాత రేషన్‌ కార్డుల్లో మార్పులు చేస్తుందా? లేదా కొత్త రేషన్‌ కార్డులతోపాటు పాతవి మంజూరు చేయనుందా? అనేది ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత తెలుస్తుంది.. ప్రజాపాలనలతోపాటు అర్హులైన లబ్ధిదారులు అప్లై చేసుకుంటే వారికి కూడా రేషన్‌ కార్డును మంజూరు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు రేషన్‌ కార్డులు తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డు లేని వారు కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook