Lalaguda Police: వాహనదారులను లిఫ్ట్‌ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి మహిళలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రోడ్డుపై రాత్రిపూట నిలబడి లిఫ్ట్ కోరుతూ అడుగుతారు. లిఫ్ట్‌ అడిగారని మానవత్వంతో లిఫ్ట్‌ ఇచ్చిన వారిని ఆ మహిళలు దోచుకుంటున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళల ఆటను పోలీసులు కట్టించారు. వారి అరెస్ట్‌తో హైదరాబాద్‌లో కొంత ప్రశాంతత ఏర్పడింది. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dead Body Parcel: డెడ్ బాడీ పార్సిల్‌లో సంచలన విషయాలు.. రూ.కోట్ల ఆస్తి కోసం అల్లుడు కుట్ర


హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. సులభంగా డబ్బులు సంపాదించాలని భావించి మోసం చేయాలని నిర్ణయించారు. కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్‌ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. వాహనదారులు డబ్బులు ఇవ్వకపోతే తమపై లైంగికదాడికి పాల్పడ్డావని బెదిరించి.. కేసు పెడతామని దబాయిస్తున్నారు. వారు భయంతో డబ్బులు ఇచ్చేవారు.

Also Read: K Annamalai: ప్రభుత్వం దిగిపోయేవరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై పాదరక్షల శపథం


ఇలా నవంబర్‌ 6వ తేదీన సాయంత్రం జెన్‌కోలో పని చేస్తున్న ఉద్యోగి బైక్‌పై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్‌ వద్ద భాగ్య అతడిని లిఫ్ట్‌ అడిగింది. బైక్‌ ఎక్కాక లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌ వద్దకు చేరుకున్నాక అక్కడ ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవారు. అనంతరం వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. అతడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ.95 వేలు బదిలీ చేయించుకుంది. అనంతరం అతడితో పాటు కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా రూ.55 వేలు విత్‌డ్రా చేయించి తీసేసుకుంది.


ఈ నెల 3వ తేదీన ఆమె తన బంధువు వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్‌ చేయించి డీటీడీసీ కొరియర్‌ వచ్చిందని కుషాయిగూడ డీమార్ట్‌ వద్దకు వచ్చి తీసుకెళ్లమని కోరింది. ఆమె మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అతడిని వారిద్దరు మళ్లీ బెదిరించి రూ.1.7లక్షలు వసూలు చేశారు. అతడిని ఈ నెల 23వ తేదీన అతడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా గుర్తించిన బాధితుడు లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వీరిపై ఇది వరకే పలు పోలీస్‌స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.