Dead Body Parcel Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మృతదేహం పార్సిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఆ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి ఆస్తి కోసం ఇదంతా డ్రామా నడిపించాడని వెలుగులోకి వచ్చింది. మామ ఆస్తి కోసం అల్లుడు భార్యతో కలిసి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. వీరి ఆస్తి గొడవల్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని చంపేయడం సంచలనంగా మారింది. ఈ కేసు వివరాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.
Also Read: K Annamalai: ప్రభుత్వం దిగిపోయేవరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై పాదరక్షల శపథం
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు తులసి, రేవతి. అతడికి రెండున్నర ఎకరాల వ్యవసాయ పొలం.. కొంత స్థలం, నగానట్ర ఉన్నాయి. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేయగా.. తులసిని భర్త వదిలేశాడు. దీంతో ఆమె వచ్చి తండ్రి వద్ద పుట్టింట్లోనే నివసిస్తోంది. అయితే అక్కాచెల్లెళ్లయిన తులసి, రేవతి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రేవతి భర్త శ్రీధర్ వర్మ మామ ఆస్తితోపాటు తులసి ఆస్తిపై కన్నేశాడు. ఎలాగైనా పొందాలని భావించి భార్య రేవతితో కలిసి కుట్ర పన్నాడు.
Also Read: Snakes Attack Video: పాముల దండయాత్ర.. చిక్కినట్టే చిక్కి తుర్రుమన్న 'తొండ'
తులసిని భయభ్రాంతులకు గురి చేసి ఆమె ఆస్తితోపాటు మామ ఆస్తి రాయించుకోవాలని భార్య రేవతితో కలిసి ప్రణాళిక రచించాడు. తులసి ఇంటి నిర్మిస్తుండడంతో ఆ ఇంటి నిర్మాణానికి సామగ్రి పంపిస్తున్నట్లు శ్రీధర్ వర్మ నమ్మబలికాడు. రెండు సార్లు సామగ్రి పంపించిన అనంతరం డిసెంబర్ 19వ తేదీన మృతదేహాన్ని పార్సిల్‌గా పంపించాడు. అది తెరచి చూడగా తులసి దిగ్భ్రాంతికి గురయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో శ్రీధర్ వర్మ పేరు బయటకు వచ్చింది.
పోలీసులు విచారణ చేపట్టి వివరాలు పూర్తిగా రాబట్టారు. గ్రామానికి చెందిన పర్లయ్య ఒంటరిగా నివసిస్తున్నాడు. అతడికి ఎవరూ లేకపోవడంతో పర్లయ్యకు శ్రీధర్ వర్మ పీకల దాకా మద్యం తాగించి తులసి పొలంలో తాడుతో అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ డెడ్‌బాడీని మరుసటి రోజు పార్సిల్‌గా పంపాడు. అలా ఎందుకు చేశాడని ఆరా తీయగా.. మామ పొలంతోపాటు తులసి ఆస్తులు కూడా కొట్టేయాలని భార్యాభర్తలు ఇద్దరూ ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఇదంతా సరే కానీ ఏ పాపం ఎరుగని పర్లయ్యను చంపడం కలచివేసే అంశం. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.