KT Rama Rao Arrest: అవినీతి జరగకున్నా జరిగిందని అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడంపై హైకోర్టులో సవాల్‌ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడిని అరెస్ట్‌ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. పది రోజుల పాటు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆలోపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏసీబీకి, ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Press Meet: ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్.. ఏం చేస్కుంటావో చేస్కో అంటూ సవాల్‌


ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా వేసింది. తీర్పుకు ముందు న్యాయస్థానంలో వాదనలు హోరాహోరీగా సాగాయి. కేటీఆర్‌ తరఫున ప్రఖ్యాత న్యాయవాది అర్యామా సుందరం వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రతివాదనలు వినిపించారు.


Also Read: KTR ACB Case: ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. నేడో రేపో అరెస్ట్‌?


'గత ప్రభుత్వంలో కేటీఆర్‌ మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదైంది' అని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదించారు. 'నగదు బదిలీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. అక్రమాలు జరిగాయని ఎలా చెబుతారు?' అని ప్రశ్నించారు. 'సొంత అవసరాలకు వాడుకుంటేనే ఇక్కడ నేరం అవుతుంది. కానీ ఇక్కడ అలాంటి ఘటనే చోటు చేసుకోలేదు' అని న్యాయవాది వివరించారు. 'ప్రజా ప్రతినిధిపై కేసు నమోదు చేసే ముందు చట్ట ప్రకారం ప్రాథమిక విచారణ చేయాలి. కానీ ఇక్కడ 18వ తేదీ ఫిర్యాదు అందగానే.. 19వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు' అని వాదించారు. 'కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్లు ఎక్కడ పేర్కొనలేదు. ఈ కేసులో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు' అని కేటీఆర్‌ తరఫున న్యాయవాది సుందరం వివరించారు.


వాదనల్లో న్యాయమూర్తి కూడా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. 'ఇక్కడ అవినీతి లేదని స్పష్టమైంది. కేటీఆర్‌కు ఎక్కడ లబ్ధి చేకూరింది' న్యాయస్థానం ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పది రోజుల పాటు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. అంటే డిసెంబర్‌ 30వ తేదీ వరకు అరెస్ట్‌ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. అనంతరం కేసును 27వ తేదీకి వాయిదా వేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter