KTR Press Meet: ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్.. ఏం చేస్కుంటావో చేస్కో అంటూ సవాల్‌

KT Rama Rao Press Meet On ACB FIR: ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 19, 2024, 08:41 PM IST
KTR Press Meet: ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్.. ఏం చేస్కుంటావో చేస్కో అంటూ సవాల్‌

KT Rama Rao Press Meet: ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఫార్ములా ఈ రేసు నిర్వహించిన అంశంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు. తాను తప్పక కేసును ఎదుర్కొంటానని.. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో ఉంచడమే తాను చేసిన తప్పా? అని నిలదీశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: KTR Bail: ముందస్తు బెయిల్‌ కూడా వద్దు.. ఏసీబీ కేసుపై కేటీఆర్‌ దమ్మున్న సవాల్‌

'రేవంత్‌ రెడ్డిది శాడిస్టు మెంటాలిటీ తప్ప ఏమీ లేదు. కుంభకోణం.. లంభకోణం అంటూ డ్రామాలు. దీనిపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రా రారు. మంత్రివర్గంలో ఏదో చర్చలు చేస్తూ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు విషయంలో సమగ్ర వివరాలు వెల్లడించారు. చంద్రబాబు నాయుడే ఎఫ్‌ 1 రేసును తీసుకురావాలని ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. లగచర్ల రైతుల ఘటనలో అరెస్టయి 37 రోజులు జైల్లో ఉండి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి కేటీఆర్‌ స్వాగతం పలికారు. లగచర్ల రైతులతోపాటు పట్నం నరేందర్‌ రెడ్డికి బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే.

Also Read: KTR ACB Case: ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. నేడో రేపో అరెస్ట్‌?

రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణ భవన్ ముందు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా తెలంగాణ భవన్‌ వద్దకు భారీగా పోలీసులు మొహరించారు. కేటీఆర్‌ అరెస్ట్‌ ఏ క్షణంలోనైనా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News