Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్‌ మల్లన్న తెలంగాణలో ప్రత్యామ్నాయ లీడర్‌గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారా ? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ నాయకుడు అవుతాడని ఎవరైనా ఊహించారా? ఢిల్లీకి సీఎం అవుతాడని అంచనా వేశారా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని అన్నారు. ప్రజల అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నాయకుడు అనేవాడు ఉద్భవిస్తాడన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ నిట్టనిలువుగా చీలిపోయి.. అందులోంచే మంచి లీడర్‌ ఉద్భవించే అవకాశం ఉండొచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మూడో స్థానానికే పరిమితం అవుతుందని, అప్పుడు కచ్చితంగా టీఆర్‌ఎస్‌ చీలిపోతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు.. ఆ పార్టీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో తెలంగాణ వాదం అనేది ఖతమైపోయిందన్నారు. తెలంగాణకు, టీఆర్‌ఎస్‌ పార్టీతో సంబంధాలు తెగిపోయాయన్నారు. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నదన్నారు. 



మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు కదా అన్న ప్రశ్నకు తీన్మార్ మల్లన్న స్పందిస్తూ.. ''కేవలం దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు'' అని సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ కనిపించదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే ముఖ్యభూమిక పోషిస్తాయని తీన్మార్‌ మల్లన్న అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాను ఇప్పుడున్న పార్టీల్లో ఇమడలేనన్న మల్లన్న (Teenmar Mallanna).. తనకు రాజకీయ పార్టీ పెట్టాలన్న ఉద్దేశ్యం కూడా లేదన్నారు. మాకు పార్టీ వద్దని, ప్రజల అవసరాలు తీరడమే ముఖ్యమని స్పష్టం చేశారు.


Also read : Teenmar Mallanna Interview: జీ న్యూస్ తెలుగు స్టూడియోలో ఎక్స్‌క్లూజీవ్‌గా తీన్మార్ మల్లన్న.. బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో


Also read : Teenmar Mallanna CM KCR: జీ న్యూస్‌ స్టూడియో సాక్షిగా ఒట్టేసిన తీన్మార్‌ మల్లన్న.. ఇకపై ఆ పనిచేయబోనని శపథం


Also read : Teenmar Mallanna about ktr: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతారన్న తీన్మార్ మల్లన్న


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook