Dethadi Harika Appointed As TSTDC Brand Ambassador: ప్రపచంలో అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ తెలుగు ఒకటి. ఈ షో ద్వారా మీకు అంతగా తెలియని వ్యక్తులు సైతం తామెంటో నిరూపించుకున్నారు. మరికొందరు తమ టాలెంట్‌కు బిగ్ బాస్ షోను వేదికగా మార్చుకున్నారు. కొందరు ఆకాశమే హద్దుగా తమ పేరు, ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోవడం సక్సెస్ సాధిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లకు మాత్రమే తెలిసిన దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా ప్రతి ఇంటికి చేరువైంది. టాప్ 5గా నిలిచి తానేంటో నిరూపించుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారికకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TSTDC) బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక(Dethadi Harika)ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 


Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది



బిగ్ బాస్ 4(Bigg Boss Telugu 4) కంటెస్టెంట్ దేత్తడి హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా నియమించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నాడు అలేఖ్య హారికకు శుభాకాంక్షలు తెలుపుతూ నియామక పత్రాలు అందజేశారు. దేత్తడి హారిక టీఎస్‌టీడీసీని మరింత ముందుకు తీసుకెళ్తారని చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఆకాంక్షించారు.


Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook