Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ కొంపెల్ల మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంపై తీవ్రంగా స్పందించే క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందగా ఆమె పరిగణించారు. తిరుమల తిరుపతి లడ్డూపై జరుగుతున్న వివాదంపై శుక్రవారం తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటన


'తిరుపతి లడ్డూ అంశాన్ని అత్యాచారంగా అభివర్ణిస్తున్నట్లు' అని మాధవీలత తెలిపారు. 'శ్రీవారి మహా ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడడం అత్యాచారం జరిగినట్టు. అది మాటలలో కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి. మహా ప్రసాదంలో జంతువుల మాంసం నుంచి వెలువడిన కొవ్వు పదార్థం వినియోగించడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపం అంటగట్టుకోవడం కంటే ఇంకా వేరేది లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Pawan Kalyan: నాగుపాము ఉంగరం ధరించిన డిప్యూటీ సీఎం పవన్‌.. ఆ రింగ్‌ ధరిస్తే ఏమవుతదో తెలుసా?


ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ తో విచారణ చేయించాలని మాధవీలత డిమాండ్‌ చేశారు. మోసం చేయాలనుకున్న దుర్మార్గులకు దేవుడు పుట్టగతులు ఇవ్వరని శాపనార్థాలు పెట్టాఉ. 'తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదు. కేవలం లడ్డూపైనే కాదు.. మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలి' అని కోరారు. '100 రోజుల  పక్కా దారి పట్టిచేందుకే ఈ అంశం తెరపైకి తెచ్చారని చెబుతున్న వైఎస్‌ జగన్. ఆయన హయాంలో జరిగిన సంఘటనలు గురించి ఏ మాట్లాడుతారు' అని ప్రశ్నించారు.


'వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి జగన్ వరకు అక్కడ అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారు. అన్యమతస్తులను దేవదాయ శాఖలో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది' అని మాధవీలత అసహనం వ్యక్తం చేశారు. 'చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకన ఒక్కొటీగా బయటకు వస్తున్నాయి. లడ్డూతో స్వామివారు వారి అరాచకాలను బయటపెట్టారు. ఇది ఇంతటితో ఆగవద్దు. శ్రీవారి మొత్తం ఆస్తులపైన విచారణ జరగాలి' అని డిమాండ్‌ చేశారు. ఇలాంటి అంశంపై  అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 'సత్యం బయటకు వచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. 125 కోట్ల మంది హైందవులు జాగృతం కావాలి. హైందవ యుద్ధం మొదలైంది' అని మాధవీలత ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.