Pawan Kalyan Snake Ring: సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం తర్వాత విజయవంతమైన హీరో పవన్ కల్యాణ్. జనసేన పార్టీ స్థాపించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌కు దేవుడంటే అమితమైన భక్తి. నిత్యం దైవ చింతనలో ఉంటారు. అలాంటి డిప్యూటీ సీఎం తాజాగా ఆయన ధరించిన ఓ ఉంగరంపై ప్రత్యేక దృష్టి పడింది. ఆయన చేతి వేలికి ఓ నాగుపాము ఉంగరం ధరించారు. ఆ ఫొటో కాస్త హాట్ టాపిక్‌గా మారింది. నాగుపాము ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుంది? ఏ ఉంగరం ప్రత్యేకత ఏమిటో అనే చర్చ మొదలైంది.
Also Read: Leaders Jump: జనసేనలోకి నాయకుల భారీ క్యూ.. నిండుకుంటున్న 'గాజు గ్లాస్' పార్టీ
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ప్రభుత్వ పాలనలోనూ.. ఇటు రాజకీయ కార్యక్రమాల్లోనూ పూర్తి బిజీ అయిపోయారు. ఆయన తన సినిమాలకు కూడా సమయమిచ్చే తీరిక లేదు. గ్రామీణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక మంత్రిగా బాధ్యతలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిత్యం ప్రభుత్వ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం భక్తిని విస్మరించలేదు. తన నమ్మకాలు తాను నమ్ముతూ ఉంటున్నారు. తాజాగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సమీక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
Also Read: Pawan Kalyan: భూమి కొంటే ఆ పత్రంపై జగన్ బొమ్మ ప్రత్యక్షం.. డిప్యూటీ సీఎం పవన్‌కు విచిత్ర అనుభవం
సమావేశాల్లో పాల్గొన్న సమయంలో ఆయన సంతకం చేస్తుండగా ఆయన చేతికి ఉన్న ఉంగరం ప్రత్యేక దృష్టి పడింది. ఒక వేలికి ఎర్రటి రాయితో ఉన్న ఒక ఉంగరం ఉంది. మరో వేలికి పాము ఆకారంలో ఉన్న ఉంగరం ఉంది. ఆ ఫొటో కాస్త చక్కర్లు కొడుతోంది. ఆయన చేతికి ఉన్నది నాగుపాము ఉంగరంగా తెలుస్తోంది. పడగ విప్పిన పాము డిప్యూటీ సీఎం వేలికి ఉంది. ఆ ఉంగరం బంగారంతో చేసి ఉన్నదై ఉండవచ్చని తెలుస్తోంది. బంగారపు వర్ణంలో పాము ఉంగరం మెరుస్తోంది.
ఈ ఉంగరం ధరిస్తే అంతా మేలు జరుగుతుందని పలువురు చెబుతున్నారు. దుష్ట శక్తుల నుంచి రక్షణగా ఉంగరం నిలుస్తుందని టాక్. ఇటీవల పలుమార్లు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు కూడా పాము ఉంగరం మేలు చేస్తుందని పండితుల మాట. ఇక రాజకీయంగాను కలిసి రావడానికి.. ప్రభుత్వ శాఖల పరంగా.. ఇలా వ్యక్తిగతంగా.. పాలనాపరంగా అన్ని విధాల మంచి జరిగేందుకు డిప్యూటీ సీఎం పాము ఉంగరం ధరించి ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ ఉంగరం పవన్‌కు అతడు నమ్మే పండితులు ఇచ్చి ఉంటారని సమాచారం. పవన్ అభిమానులైతే అచ్చం అలాంటి పాము ఉంగరం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరికొందరు ఆ ఉంగరం ఎక్కడ లభిస్తుందోనని నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook