KCRకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన జీవీఎల్
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఓంటరిగా దూసుకువెళ్తోంది. ఎవరి మద్దుతు లేకుండా సొంతంగా బరిలోకి దిగుతున్న కమలదళం ..17 ఎంపీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను ప్రకటించిన ప్రచారంలో చేసుకుంటోంది. ఈ క్రమంలో పెద్దపల్లి స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఎస్.కుమార్ తరఫున రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ రోజు ప్రచారం నిర్వహించారు
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే కిలాడి చంద్రశేఖర్ రావు అంటూ ఎద్దేవ చేశారు. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మోవద్దని కోరారు. ఎన్నికల్లో గెలించేందుకు కేసీఆర్ ఓటు బ్యాంకురాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మతతత్వ ఎంఐఎంతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి విభజన రాజకీయాలు చేయడం కేసీఆర్ మానుకోవాలని జీవీఎల్ హితవు పలికారు. తెలంగాణలో కేసీఆర్ నిజాం పాలన కొనసాగిస్తున్నారని..ఇది అంతమవ్వాలంటే బీజేపీ అభ్యర్ధులను ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా జీవీఎల్ ఓటర్లను కోరారు
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ కేంద్రం సహకారంతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాగాణ మరింత వేగంగా అభివృద్ధి పథంలో పయనించాలంటే జాతీయ పార్టీతోనే ఇది సాధ్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని... మళ్లీ మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.