Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి. వలస నేతల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా చేరికల కమిటీలను ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ జాయినింగ్ కమిటికి సీనియర్ నేత జానారెడ్డి చీఫ్ గా ఉండగా.. బీజేపీ చేరికల కమిటి కన్వీనర్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తించి తమవైపు లాగడమే ఈ కమిటీల పని. తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని కాంగ్రెస్, బీజేపీలు ప్రకటిస్తున్నాయి. ఆషాడమాసం కాబట్టి చేరికలు తగ్గాయని.. శ్రావణమాసంలో జోరుగా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పుడు శ్రావణమాసం రావడంతో ఎవరూ ఏ పార్టీలో చేరుతారు అన్నది ఆసక్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపో మాపో కమలం గూటికి చేరనున్నారు. ఆయన పార్టీ మారకుండా చూసేందుకు కాంగ్రెస్ జాతీయ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండు వారాల్లో కోమటిరెడ్డి బీజేపీలో చేరుతారని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నేతలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు జంపింగ్ జాబితాలో వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారంటున్నారు. ఖమ్మం జిల్లా నేతలకు సంబంధించే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొందరు నేతలు కమలం పార్టీ పెద్దలతో కాంటాక్టులో ఉన్నారనే టాక్ వస్తోంది.  


మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా కొన్ని రోజులుగా సాగుతోంది. తనపై వస్తున్న వార్తలను పొంగులేటి ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా... పార్టీ మారడం ఖాయమనే ప్రచారం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా పొంగులేటికి సంబంధించి ఆసక్తికర పరిణామం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రావడం సంచలనంగా మారింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో వివాహ వేడుక జరుగుతోంది. శ్రీనివాస్ రెడ్డి కూతురు సప్ని రెడ్డికి రామసహాయం సురేందర్ రెడ్డి మనుమడు అర్జున్ రెడ్డితో పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ కి సమీపంలో ఉన్న  పొంగులేటి నూతన రిసార్ట్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ​ని ప్రత్యేకంగా ఆహ్వానించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి ఎంగేజ్ మెంట్ వేడుకకు హాజరయ్యారు బండి సంజయ్. వధూవరులను ఆశీర్వదించారు. తమ నివాసానికి వచ్చిన బండికి పొంగులేటి సాదర స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఈ వేడుకకు హాజరయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు. ఈ వేడుకలోనే రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు చాలా సేపు మాట్లాడుకోవడం ఆసక్తి రేపింది.


[[{"fid":"239963","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాని ఆ పార్టీ కీలక నేతలు మాత్రం ఈ వేడుకలో పెద్దగా కనిపించ లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరుకాలేదు.  కేటీఆర్ కాలుకు గాయంతో రెస్ట్ తీసుకుంటున్నారు. అందుకే ఆయన ఈ వేడుకకు రాలేదంటున్నారు. కాని ముఖ్యమంత్రి ఎందుకు రాలేదన్నది చర్చగా మారింది. వారం రోజుల ఢిల్లీ పర్యటన నుంచి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు. కాని పొంగులేటి వేడుకకు వెళ్లలేదు. సాధారణంగా పార్టీ నేతలకు సంబంధించిన పార్టీలకు కేసీఆర్ వెళుతుంటారు. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు నేరుగా విమానాశ్రయం నుంచి వివాహ వేడుకలకు హాజరైన సందర్భాలున్నాయి. కాని పార్టీలో కీలక నేతగా ఉన్న పొంగులేటి కూతురు ఎంగేజ్ మెంట్ వేడుకకు వెళ్లకపోవడంపై పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ నేతలు ఈ వేడుకలో సందడి చేయడం ఆసక్తిగా మారింది.


Read also: TDP MLA: పేపర్ బాయ్ గా టీడీపీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?


Read also: LPG Price Today: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర!  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook