TDP MLA: పేపర్ బాయ్ గా టీడీపీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

TDP MLA:  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే పేపర్ బాయ్ గా మారారు. ఉదయం లేవగానే దినపత్రికలు తీసుకుని సైకిల్ పై తిరుగుతూ ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే పేపర్ తీసుకుని వస్తుండటంతో స్థానికులు షాకవుతున్నారు. అయితే తాను ఒక మంచి పని కోసమే పేపర్ బాయ్ గా మారానని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే.  

Written by - Srisailam | Last Updated : Aug 1, 2022, 09:37 AM IST
  • పేపర్ బాయ్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే
  • ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్న రామానాయుడు
  • ప్రతీ నెలా నాలుగు రోజులు పేపర్ బాయ్ గా ఎమ్మెల్యే
TDP MLA: పేపర్ బాయ్ గా టీడీపీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

TDP MLA:  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే పేపర్ బాయ్ గా మారారు. ఉదయం లేవగానే దినపత్రికలు తీసుకుని సైకిల్ పై తిరుగుతూ ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే పేపర్ తీసుకుని వస్తుండటంతో స్థానికులు షాకవుతున్నారు. అయితే తాను ఒక మంచి పని కోసమే పేపర్ బాయ్ గా మారానని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే.

వివరాల్లోకి వెళితే ఏపీ టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉంటారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆయన చేసే నిరసన కార్యక్రమాలు వినూత్నంగానే ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గతంలో సైకిల్ యాత్రలు చేశారు. రైతుల సమస్యలపై ఉరితాడుతో నిరసన తెలిపారు. అధ్వాన్నంగా తయారైన రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి రోడ్లపై  ఏర్పడిన గుంతల్లో చేపలు పట్టి నిరసన తెలిపారు.  ఏపీలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ... జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తాళిబొట్లతో  నిరసన వ్యక్తం చేశారు

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. తాజాగా పేపర్ బాయ్ అవతారం ఎత్తారు. ఉదయం లేవగానే పాలకొల్లులో తన సైకిల్ పైన దినపత్రికలను తీసుకొని, స్థానిక పేపర్ బాయ్స్ తో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణి చేశారు. ఏపీలో అధికార వైసీపీ గడపగడపకు ప్రభుత్వం పేరుతో జనంలోకి వెళుతోంది. ఈ కార్యక్రమానికి కౌంటర్ గానే నిమ్మల పేపర్ బాయ్ లా మారి గడపగడపకు వెళుతున్నారని తెలుస్తోంది.

వైసీపీ నేతలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు. పేపర్ వేయడంతో పాటు స్థానికులతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్నారు. 90 శాతం నిర్మాణాలు పూర్తైన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని.. మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా జగన్ సర్కార్ చేస్తున్న జాప్యాన్ని లబ్దిదారులకు చెబుతున్నారు. 

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రతీ నెలా నాలుగు రోజులు పాటు ఇలా పేపర్ బాయ్ గా ఉంటానని చెప్పారు ఎమ్మెల్యే రామానాయుడు. మరో నాలుగు రోజులు పారిశుధ్ద్య పనులు చేస్తానని చెప్పారు.

Read also: Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. పోలీసుల హై అలర్ట్

Read also: Telangana Rains: తెలంగాణకు ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన..పిడుగులు పడే ప్రాంతాలు ఇవే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x